Advertisementt

మెగా హీరోల చూపు పడటం ఖాయం..!

Tue 10th Jan 2017 05:35 PM
tamil hero vijay,director muragaadas,mahesh babu,tupaki movie,tollywood dubbing movie tupaki  మెగా హీరోల చూపు పడటం ఖాయం..!
మెగా హీరోల చూపు పడటం ఖాయం..!
Advertisement
Ads by CJ

దక్షిణాదిన సంచలన దర్శకునిగా మురుగదాస్‌కు ఎంతో పేరుంది. ఆయన చేసే చిత్రాల కోసం అన్నిభాషల వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన తీసిన 'రమణ' చిత్రాన్ని 'ఠాగూర్‌'గా, 'కత్తి' చిత్రాన్ని తాజాగా 'ఖైదీనెంబర్‌150'గా చిరు రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో చేస్తున్న ద్విభాషా చిత్రంపై అందరి దృష్టి ఉంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మురుగదాస్‌ మరోసారి తమిళస్టార్‌ విజయ్‌తోనే మరో చిత్రం చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్‌లో 'తుపాకి, కత్తి' చిత్రాలు వచ్చాయి. 

'తుపాకి' చిత్రం మాత్రం తెలుగులో రీమేక్‌ కాకుండా డబ్బింగ్‌గా అదే పేరుతో విడుదలైంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని కూడా రీమేక్‌ చేయాలని పలువురు మెగా హీరోలు ప్రయత్నించినప్పటికీ విజయ్‌ బలవంతం మీద ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను అమ్మకుండా డబ్‌ చేశారు. మరోవైపు త్వరలో విజయ్‌ అట్లీ దర్శకత్వంలో చేయనున్న చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలని విజయ్‌, అట్లీలు నిర్ణయించారు. దీంతో మహేష్‌తో మురుగదాస్‌ చిత్రం విడుదలై ఆ తర్వాత విజయ్‌ అట్లీల చిత్రం పూర్తయ్యేలోపు మురుగదాస్‌ విజయ్‌తో చేయబోయే హ్యాట్రిక్‌ మూవీకి స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక విజయ్‌కి ఎలాగూ తెలుగులో పెద్దగా క్రేజ్‌ లేదు. కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్‌ చేయకుండా రీమేక్‌ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్రం మంచి విజయం సాధించిన పక్షంలో మరోసారి మెగాహీరోల చూపు ఈ చిత్రంపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ