Advertisementt

రికార్డులను బ్రేక్‌ చేయడం ఆయనకే సాధ్యం..!

Thu 12th Jan 2017 03:40 PM
bollywood star aamir khan,350 crores collections in dangal movie,pk movie 335 crores,kaabil movie,raees movie,release on january 25th 2017  రికార్డులను బ్రేక్‌ చేయడం ఆయనకే సాధ్యం..!
రికార్డులను బ్రేక్‌ చేయడం ఆయనకే సాధ్యం..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ స్టార్స్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ గురించే. ఆలస్యంగా చిత్రాలు చేసినా కూడా ఆయన రికార్డులను ఆయనే బద్దలు కొట్టేలా చేసుకోవడం ఆయనకే చెల్లిదంటున్నాయి బాలీవుడ్‌ ట్రేడ్‌వర్గాలు. ఆయన నటించిన 'పీకే' చిత్రం ఇండియాలో 337కోట్లు సాధించి ఇప్పటివరకు బాలీవుడ్‌లో మొదటి స్థానంలో ఉంది. కాగా తాజాగా విడుదలైన 'దంగల్‌' చిత్రం ఈ రికార్డును బ్రేక్‌ చేసింది. ఇప్పటికే 350కోట్లను కూడా దాటి నాలుగో వారంలో కూడా స్టడీ కల్షెన్లు సాధిస్తోంది. ఇక ఈ చిత్రం ఇండియాలో 400కోట్లు చేరుకోవడమే తరువాయి అంటున్నారు. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఇప్పటికే 650కోట్లు దాటింది. ఇదే కలెక్షన్లను 'కాబిల్‌, రాయిస్‌'లు విడుదల కానున్న ఈ నెల 25వరకు రాబడితే ఇక వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం 700కోట్లను తాకవచ్చనే అంచనాలు, లెక్కలు మొదలయ్యాయి. ఇదే మార్కులను 'దంగల్‌' టచ్‌ చేస్తే మాత్రం ఇక ఆయన రికార్డులను కొల్లగొట్టడం ఇతరులకు సాధ్యం కాదని, 'ధూమ్‌3' నుంచి కలెక్షన్ల విషయంలో సంచలనం సృష్టిస్తోన్న అమీర్‌కే ఇది సాధ్యమంటున్నారు ఆయన అభిమానులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ