ప్రస్తుతం పవన్ మూడు చిత్రాలను ఓకే చేశాడు. అజిత్ 'వీరం' ఆధారంగా డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత పవన్.. త్రివిక్రమ్‌తో కలిసి ఓ స్ట్రెయిట్ చిత్రం చేయనున్నాడు. వీటి తర్వాత ఎ.యం.రత్నం నిర్మాతగా అజిత్ నటించిన చిత్రమే అయిన 'వేదాలం' రీమేక్‌ను తమిళ దర్శకుడు నీసన్‌తో చేయనున్నాడు. కాగా ప్రస్తుతం పవన్ నాలుగో చిత్రానికి కూడా ఓకే చెప్పే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అజిత్‌కి వరుసగా 'వీరం, వేదాళం' వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన కెమెరామెన్ అండ్ డైరెక్టర్ శివ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన గోపీచంద్ హీరోగా రెండు చిత్రాలు చేశాడు. ఇందులో ఒకటి మంచి విజయం సాధించగా, మరో చిత్రం మాత్రం నిరాశపరచింది. ఇక రవితేజతో 'దరువు' తీశాడు. ఇది కూడా సరిగ్గా ఆడకపోవడంతో ఆయన కోలీవుడ్‌పై దృష్టిపెట్టి అజిత్ ప్రోత్సాహంతో వరుస హిట్స్‌ను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అజిత్‌తో మరో చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం శివ.. పవన్ కోసం మూడు నాలుగు పవర్‌ఫుల్ స్టోరీలను సిద్దం చేశాడట. అజిత్‌తో ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రం పూర్తయిన తర్వాత వాటిని పవన్‌కు వినిపించనున్నాడని, ఇందులో ఏ స్టోరీ నచ్చినా శివతో పవన్ సినిమా గ్యారంటీ అంటున్నారు. ఇక శివ అజిత్‌ల చిత్రం సాధించబోయే ఫలితం మీదనే శివ చిత్రం పవన్‌తో ఉంటుందా? లేదా? అనేది ఆధారపడివుంటుంది. మరి పవన్ శివ కేవలం పవన్ కోసం తయారు చేసిన స్టోరీలనే ఒప్పుకుంటాడా? లేక మరోసారి తాజా అజిత్ చిత్రం హిట్టయితే దానినే రీమేక్ చేస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు వీలైనన్ని చిత్రాలు చేయాలని పవన్ భావిస్తున్నాడు. కాగా ఆయన దాసరికి కూడా ఓ చిత్రం చేస్తానని హామీ ఇచ్చాడు మరి శివ స్టోరీ నచ్చితే ఆయనతో చేయబోయే చిత్రం దాసరి బేనర్‌లోనే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పవన్, తమిళ స్టార్ అజిత్‌ను ఫాలోఅవుతున్నాడంటూ ఆయన యాంటీ ఫ్యాన్స్ విమర్శలు మొదలుపెట్టారు. మరి దీనిపై పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది....!