'ప్రేమమ్', 'అ...ఆ'ల తర్వాత మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ గోల్డెన్‌లెగ్‌గా మారిపోయింది. ఇక తాజాగా ఈ అమ్మడు శర్వానంద్ సరసన దిల్‌రాజు బేనర్‌లో రూపొంది, విడుదలైన 'శతమానం భవతి' చిత్రంలో కూడా ఆకట్టుకునే ప్రయత్నం బాగానే చేసింది. ఇక ఆమె త్వరలో ప్రారంభంకానున్న సుకుమార్-రామ్‌చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో సక్సెఫుల్ నిర్మాణ సంస్థగా భారీ విజయాలు సాధిస్తోన్న మైత్రిమూవీమేకర్స్ నిర్మించనున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోందని ఈమద్య వరకు వార్తలు వచ్చాయి. ఈ పాత్రకు మొదట రాశీఖన్నాను అనుకొని ఆ తర్వాత ఆమెను తప్పించి అనుపమ పరమేశ్వరన్‌ని పెట్టుకుంటున్నారని ప్రచారం మొదలైంది. కానీ ఇవి కేవలం గాలివార్తలుగానే కొందరు భావించారు. తాజాగా ఈ అమ్మడు ఆ చిత్రంలో నటించనున్నట్లు కన్‌ఫర్మ్ చేసి, తన ఆనందాన్ని అందరితో పంచుకుంది. ఇక త్వరలో ఆమె ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో కూడా ఎంపికైందని, నానితో మరో చిత్రం చేస్తున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ భామపైనే ఉన్నాయి. ఇక ఒక్కసారి మెగాఫ్యామిలీ హీరోలతో కలిసి నటిస్తే ఇక ఆ ఫ్యామిలీ హీరోలందరూ వయోబేధం లేకుండా వారితో వరుస చిత్రాలలో అవకాశం ఇస్తారనేది ఇప్పటికే కాజల్, రకుల్‌ప్రీత్‌సింగ్ వంటి వారు నిరూపించారు. కాజల్ అయితే ఇటు బాబాయ్‌లతో పాటు అటు అబ్బాయిలతో అందునా 61ఏళ్ల వయసున్న చిరు పక్కన అందులో సగం వయసు కూడా లేని ఆమె ఛాన్స్ కొట్టి, ప్రస్తుతం 'ఖైదీ' చిత్రంతో అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక ఇదే బాటలో అనుపమ కెరీర్ ఓ వెలుగు వెలగడం ఖాయమంటున్నారు. మరి సుక్కు చిత్రంలో ఆమె సెకండ్‌హీరోయినా? లేక మెయిన్ హీరోయినా? అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.