గతంలోనే కాదు.. నేడు కూడా చాలా మంది నటులు, రచయితలు,కొరియోగ్రాఫర్లు, నిర్మాతలు, కెమెరామేన్స్.. ఇలా అందరూ నిర్మాతలుగా, దర్శకులుగా మారాలని ఆరాటపడుతున్నారు. మెగాఫోన్ చేతబట్టి మొత్తానికి కొందరు మంచి సక్సెస్ అవుతూ త్రివిక్రమ్, కొరటాలలాగా పేరుతెచ్చుకుంటే మరి కొందరు మాత్రం ప్రేక్షకులకు నరకం చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు మరీ ముఖ్యంగా రచయితలు తమను ఇతర దర్శకులు మోసం చేస్తున్నారని, తమకు సరైన క్రెడిట్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. కోనవెంకట్, గోపీమోహన్ నుంచి ఇలా అందరూ ఆవేదన చెందుతున్న వారే. అయినా ప్రతి రచయిత ఎంత అనుభవం ఉన్నా కూడా దర్శకులుగా రాణించలేకపోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో ప్రత్యక్ష ఉదాహరణగా పరుచూరి బ్రదర్స్‌ను చెప్పుకోవచ్చు. వారికి రచయితలుగా ఉన్న అనుభవంతో మెగాఫోన్ పట్టుకున్నప్పటికీ వారు దర్శకద్వయంగా మెప్పించలేక మౌనం వహించారు. త్వరలో నటునిగా బుల్లితెరపై తన ప్రస్ధానం మొదలుపెట్టి, ఆతర్వాత వెండితెరపై చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి, ప్రస్తుతం రచయితగా మారి హీరో నితిన్ తలరాతను మార్చిన వ్యక్తి హర్షవర్ధన్. వాస్తవానికి తనకు సెకండ్ ఇన్నింగ్స్‌లో లైఫ్ ఇచ్చిన హర్షవర్దన్‌కు నితిన్ తానే హీరోగా, తానే నిర్మాతగా ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చి మరీ పెద్ద తప్పు చేశాడు. వక్కంతం వంశీ ని జూనియర్ ఎన్టీఆర్ మభ్య పెట్టాడో.. . నితిన్ కూడా ఆయన్ను అదే విధంగా చేశాడు. దాంతో ఇక నితిన్‌తో లాభం లేదని నిర్ణయించుకున్న హర్షవర్దన్ మరింత విలువైన సమయాన్ని వృథా చేయకుండా ఓ మంచి యాంకర్‌గా చేస్తూ, ఇప్పటికే పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన శ్రీముఖిని ప్రధానపాత్రకు తీసుకొని, ఓ వినూత్న కథాంశంతో దర్శకునిగా మారుతున్నాడు. మరి ఈ చిత్రం దర్శకునిగా హర్షవర్ధన్‌కు, నటిగా శ్రీముఖికి మంచి బ్రేక్‌నివ్వాలని ఆశిద్దాం.