Advertisementt

ఈ భామకే ఎక్కువ మార్కులు.....!

Mon 16th Jan 2017 10:25 PM
anupama parameswaran,shatamanam bhavati  ఈ భామకే ఎక్కువ మార్కులు.....!
ఈ భామకే ఎక్కువ మార్కులు.....!
Advertisement
Ads by CJ

రెండు కమర్షియల్ చిత్రాల మధ్య నేనున్నానంటూ వచ్చిన 'శతమానంభవతి' చిత్రానికి సంతృప్తికరమైన కలెక్షన్లు వస్తున్నాయి. తక్కువ  బడ్జెట్ తో తీసిన ఈ సినిమా లాభాల బాటలో పడడానికి వారం సరిపోతుంది. దిల్ రాజు ఫార్ములా ఫలించింది. కుటుంబ చిత్రంగా చేసిన ప్రచారం వర్కవుట్ అయింది. ఇక 'శతమానంభవతి'లో నటించిన అందరిలో అనుపమకే ఎక్కువ మార్కులు లభించాయి. శర్వానంద్ తో ఆమెకు కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. రెగ్యులర్ హీరోయిన్ కాకుండా అనుపమను ఎంపికచేసుకోవడం వల్ల ఫ్రెష్ లుక్ కనిపించి, చిత్ర విజయానికి తోడ్పడింది. రన్నింగ్ లో ఉన్న హీరోయిన్లకు అనుపమ నుండి గట్టి పోటీ ఏర్పడడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. యువతరం స్టార్స్ తమ కొత్త సినిమాల్లో ఆమెను రికమండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. అనుపమ గ్లామర్ పాత్రలు చేయడానికి అంగీకరించాలి. అంతేకాదు మాస్ ని ఆకట్టుకోవడానికి కొంత బెట్టు సడలించుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ