Advertisementt

మహేష్ సినిమాలో ఇన్ని ప్రత్యేకతలా..!

Tue 17th Jan 2017 08:33 PM
mahesh babu,murugadoss,specials,mahesh and murugadoss movie special  మహేష్ సినిమాలో ఇన్ని ప్రత్యేకతలా..!
మహేష్ సినిమాలో ఇన్ని ప్రత్యేకతలా..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి ఇంతవరకు టైటిల్ అంటూ ఇదే అని చిత్ర యూనిట్ ఎక్కడా చెప్పలేదు. కాకపొతే ఇదే మహేష్ టైటిల్ అంటూ 'సంభవామి' అనే టైటిల్ ఆ మధ్యన సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  కానీ చిత్ర యూనిట్ సంభవామి టైటిల్ ని ఎక్కడా ధ్రువీకరించలేదు. అదలా ఉండగా... మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రానికి బోలెడన్ని స్పెషల్స్ వున్నాయంటున్నారు. ఈ సినిమాకి ఉన్న ఆ ప్రత్యేకతలేమిటో మీరూ ఓ లుక్కేయండి. 

మొట్టమొదటిసారి మహేష్, మురుగదాస్ డైరెక్షన్ లో నటించడం, ఒకేసారి ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో  బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కడం, ఫస్ట్ టైం రకుల్ ప్రీత్ మహేష్ పక్కన హీరోయిన్ గా చెయ్యడం, మహేష్ కి 'నాని' చిత్ర డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్‌గా నటించడం, ఒక తమిళ్ హీరో మహేష్ చిత్రంలో ముఖ్యపాత్ర చెయ్యడం, మొదటిసారి మహేష్ ఒక ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌ గా కనిపించడం వంటి ప్రత్యేకతలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని చెబుతున్నారు. మరి మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కే ఈ చిత్రంపై బోలెడన్ని అంచనాలున్నాయి. ఇక ఇన్ని ప్రత్యేకతలు  కనబడుతుంటే ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్‍లోని అమీర్‌పేట్‌లో జరుగుతుండగా... హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైన వెంటనే పూణే, ముంబైలలో కొన్ని రోజులు షూటింగ్ జరిపాక ఫిబ్రవరి నుండి సాంగ్స్ షూట్ చేసేలా యూనిట్ ప్లాన్ చేసిందని చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ