Advertisementt

ల్యాండ్‌ మార్క్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు..!

Wed 18th Jan 2017 03:37 PM
director krish,gautamiputra satakarni movie,victory venkatesh,guru movie,venkatesh 74 movie director krishore tirumala,75 movie director krish  ల్యాండ్‌ మార్క్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు..!
ల్యాండ్‌ మార్క్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు..!
Advertisement
Ads by CJ

'గమ్యం' నుంచి మొదలుపెట్టి 'కంచె' వరకు విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌. కాగా ఆయనకు ఈ చిత్రాల ద్వారా ప్రశంసలు, అవార్డులైతే అందాయి కానీ రివార్డులు మాత్రం రాలేదు. చివరకు తమిళ 'రమణ'కు రీమేక్‌గా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'ఠాగూర్‌'ను ఆయన బాలీవుడ్‌లో స్టార్‌ అక్షయ్‌కుమార్‌ హీరోగా 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌'ను తీసినా కూడా ఆయనకు ఆ చిత్రం కూడా కమర్షియల్‌ బ్రేక్‌ను ఇవ్వలేకపోయింది. ఎట్టకేలకు ఆయనకు బాలకృష్ణ అందించిన సువర్ణావకాశమైన ఆయన వందో చిత్రంగా, ల్యాండ్‌మార్క్‌ మూవీగా తెరకెక్కిన తాజా 'గౌతమీపుత్ర...' చిత్రం కమర్షియల్‌గా కూడా పెద్ద హిట్‌గా సాగుతున్న తరుణంలో ఆయనకు ఒక్కసారిగా స్టార్‌డైరెక్టర్‌ ఇమేజ్‌ వచ్చింది. ఇక ఆయన దానిని నిలబెట్టుకోవడమే ఆయన ముందున్న పెద్ద లక్ష్యం. 

కాగా గతంలో మహేష్‌బాబుతో చిత్రం చేయాలని ప్లాన్‌ చేసినా కూడా నెరవేరలేదు. ఆ కోరికలు ఆయనకు ఇప్పుడు నెరవేరేలా కనిపిస్తున్నాయి. మహేష్‌తో పాటు మెగా కాంపౌండ్‌ హీరోల నుండి నందమూరి హీరోల వరకు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా ఆయన 'గౌతమీ....' చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూనే, ఈ స్థాయిని నిలబెట్టుకునేందుకే ఆయన గ్యాప్‌ తీసుకోనున్నాడట. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని చరణ్‌తో చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ క్రిష్‌ ఆలోచన మాత్రం వేరేగా ఉంది. ఆయన మరో సీనియర్‌ స్టార్‌ అయిన వెంకటేష్‌తో తదుపరి చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం వెంకీ 'గురు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వేసవికి విడుదలకానుంది. ఆ తర్వాత తాను ముందుగా ప్రకటించిన విధంగానే తన 74వ చిత్రాన్ని 'నేను.. శైలజా' ఫేమ్‌ కిషోర్‌ తిరుమలతో 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' ప్రారంభించనున్నాడు. 

కాగా ఆయన తన 75వ చిత్రాన్ని పూరీ దర్శకత్వంలో చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ వెంకీ ల్యాండ్‌మార్క్‌ మూవీ అయిన 75వ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించనున్నాడు.ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ నిర్మించనున్నాడు. ఈ చిత్రం కోసం ఇప్పుటివరకు తాను టచ్‌ చేయని జోనర్‌ అయిన సోషియోఫాంటసీ చిత్రం చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా క్రిష్‌ రానా హీరోగా తెరకెక్కించిన 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలో వెంకీ ఓ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే. మొత్తానికి క్రిష్‌ ప్రస్తుతం ల్యాండ్‌మార్క్‌ మూవీల డైరెక్టర్‌గా మారిపోయాడా అనిపిస్తోంది. వెంకీతో చిత్రం తర్వాత ఆయన మరోసారి అక్షయ్‌కుమార్‌తోనే బాలీవుడ్‌లో ఓ చిత్రం చేయనున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ