ఆమె నటించిన మూడు సినిమాలు పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు. అయినా కూడా ఒక స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసి ఒక పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తుంది. ఆమె ఎవరూ అనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు. 'ముకుందా' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే. పూజ హెగ్డే 'ముకుందా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వెంటనే నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చిత్రంలో నటించింది. ఇక ఈ రెండు సినిమాలు ఏవరేజ్ టాక్ తో నడిచాయి. అయితే అమ్మడికి మాత్రం బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ తగిలింది. మొదటిసారి హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసి 'మోహింజదారో' చిత్రంలో నటించింది.
కానీ ఆ సినిమా అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినా పూజకు అదృష్టం తలుపుతడుతూనే వుంది. మళ్ళీ టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన 'డీజే'( దువ్వాడ జగన్నాథం) లో ఛాన్స్ దక్కించుకుంది. మరి ఈ చిత్రమైన హిట్ అవుతుందా? అంటే ఇది పక్కా హిట్ అని అంటుంది పూజా. తాను బన్నీకి ఫ్యాన్ అని..... బన్నీతో చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నానని..... బన్నీ స్వీట్ పర్సన్ అని ఒకటే అల్లు అర్జున్ భజన చేస్తోంది. మరి ఈ సినిమా అయినా హిట్ అయ్యి పూజ ఐరెన్ లెగ్ ముద్రను పోగొట్టుకుని లక్కీ హీరోయిన్ అవతారం ఎత్తుతుందో లేదో తెలియాలంటే డీజే చిత్రం విడుదల వరకు చూడాల్సిందే.