Advertisementt

ఈ లెక్క నిజమేనా..?

Wed 18th Jan 2017 09:16 PM
khaidi no 150 movie,chiranjeevi,allu aravind,ram charan,khaidi no 150 movie collections 106 crores  ఈ లెక్క నిజమేనా..?
ఈ లెక్క నిజమేనా..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి స్టార్‌డమ్‌కు తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ 'ఖైదీ నంబర్‌ 150'కి కలెక్షన్ల పంటపండుతోంది. మంగళవారంతో వారం రోజుల ప్రదర్శన పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి 106 కోట్లు గ్రాస్ వచ్చిందని యూనిట్‌ ప్రకటించింది. దీనిని గర్వంగా చెప్పుకున్నారు. 

ఈ లెక్కలపై ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 106 కోట్ల గ్రాస్‌ అనేది ఏ ప్రాతిపదికన ప్రకటించారు? అని వారు సందేహిస్తున్నారు. తొలి రోజు 47 కోట్లు కలెక్ట్‌ చేసిందని అల్లు అరవింద్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించారు. 106లో 47 కోట్లు తీసివేస్తే 59 కోట్లు బ్యాలెన్స్‌ కలెక్షన్లు ఆరు రోజుల్లో వచ్చాయని స్పష్టమైంది. అంటే ఏవరేజ్‌గా తీసుకుంటే ఒక్కో రోజుకు సుమారు తొమ్మిదిన్నర కోట్లు కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది ట్రేడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి. 

తొలి రోజు బలమైన ప్రత్యర్థి లేనందువల్లే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని యూనిట్‌ చెప్పకనే చెప్పారు. ఒక మాస్‌ హీరో సినిమాను పక్కా ప్రణాళికతో రిలీజ్‌ చేస్తే ఈ మాత్రం కలెక్షన్లు రాబట్టడం తేలిక అని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ