Advertisementt

రామ్ చరణ్ లైన్లోకి వస్తున్నాడు...!

Sat 21st Jan 2017 12:01 PM
ram charan,dhruva,ram charan and sukumar film update,mythri movie makers  రామ్ చరణ్ లైన్లోకి వస్తున్నాడు...!
రామ్ చరణ్ లైన్లోకి వస్తున్నాడు...!
Advertisement
Ads by CJ

'ధృవ' విజయంతో రామ్ చరణ్ ఫుల్ జోష్ మీదున్నాడు. 'ధృవ' లో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉండగానే నిర్మాతగా తన తండ్రి నటించిన 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' తో నిర్మాతగా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తన తల్లి సురేఖ  'ఖైదీ...' చిత్ర నిర్మాత అయినప్పటికీ రామ్ చరణ్ అన్నీ తానై 'ఖైదీ నెంబర్ 150' నిర్మాణ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు. ఇక ఆ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ చరణ్ కు లాభాల పంటను తెచ్చిపెట్టింది. ఇక ఈ విజయాలతో మంచి జోష్ మీదున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు.

రామ్ చరణ్  తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న విషయం తెలిసిందే.  చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ప్రేమ కథా చిత్రం ఈ నెల(జనవరి) 30 న మొదలవబోతున్నట్లు సమాచారం. 30 న పూజా కార్యక్రమాలతో మొదలై.. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో చరణ్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని.. అందుకే చరణ్ తన లుక్ ని టోటల్ గా మార్చుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ చిత్రంలో 'అ... ఆ, ప్రేమమ్, శతమానంభవతి' ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు రాశి ఖన్నాలు రామ్ చరణ్ కి జోడిగా సెలెక్ట్ అయినట్లు వార్తలొస్తున్నాయి.    

మొదటి షెడ్యూల్‌ గోదావరి జిల్లాలో చిత్రీకరించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ క్లోజ్ ఫ్రెండ్  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక దాదాపు ఒక సంవత్సరంపాటు  బిగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ 'నాన్నకి ప్రేమతో' తర్వాత చేస్తున్న ప్రాజెక్టు కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ