ఇటు కథాబలం చిన్న చిత్రాలను, మరోవైపు అప్‌కమింగ్‌స్టార్స్‌తో చిత్రాలు చేస్తూనే స్టార్స్‌తో భారీ చిత్రాలు చేయడంలో దిల్‌రాజు స్టైలే వేరు. ఆయన తాజాగా శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేష్ వంటి దర్శకునితో అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్‌రాజు, జయసుధలతో తీసిన చిన్న చిత్రం 'శతమానం భవతి' సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు భారీ లాభాలు తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చిత్రాన్ని చిరు 'ఖైదీ'.. బాలయ్య 'గౌతమీపుత్ర...'లతో పాటు రిలీజ్ చేసి ధైర్యంగా హిట్ కొట్టిన దిల్‌రాజుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ప్రస్తుతం ఆయన నాని హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్‌గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో 'సినిమా చూపిస్త మావా' ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నిర్మిస్తున్న 'నేను...లోకల్' చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఇక సమ్మర్ రేసులో ఆయన హరీష్‌శంకర్ దర్శకత్వంలో బన్నీ హీరోగా 'డిజె' (దువ్వాడజగన్నాథం) అనే ఆసక్తికర టైటిల్‌తో చేస్తున్న చిత్రం విడుదలకానుంది. ఆ వెంటనే ఆయన మరో మెగాహీరో వరుణ్‌తేజ్‌తో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఫిదా' చిత్రం విడుదల కానుంది. వీటి మధ్యలోనే ఆయన 'ఓకే బంగారం' తర్వాత మణిరత్నం, కార్తి హీరోగా తెరకెక్కిస్తున్న 'డ్యూయెట్' చిత్రం మార్చిలో విడుదలకానుంది. కాగా ఇప్పుడు ఆయన చూపు మెగాస్టార్ చిరంజీవిపై పడింది. 'శతమానం....' చిత్రం చూసి చిరు ఎంతగానో మెచ్చుకున్నారని తాను కూడా ఆయన ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చానంటూ, త్వరలో మంచి కథ దొరికితే చిరుతో చిత్రం చేస్తానన్నాడు. అదే సమయంలో ఆయన చరణ్‌తో కూడా మరో చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో మంచి కథ కోసం అన్వేషిస్తున్నాడట. ఇక ఎలాగూ ఆయన త్వరలో రవితేజతో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత మహేష్‌బాబు హీరోగా అశ్వనీదత్‌తో కలిసి వంశీపైడిపల్లి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఇలా బిజీ,.. బిజీగా ఉన్న దిల్‌రాజు మొత్తానికి మెగాహీరోలను మాత్రం వదిలేలా కనిపించడం లేదు.