Advertisementt

గతాన్ని గుర్తు చేసుకున్నాడు జక్కన్న..!

Mon 23rd Jan 2017 12:04 PM
raja mouli,krish,vv vinayak,gautamiputra satakarni movie,balakrishna,chenna kesava reddy movie  గతాన్ని గుర్తు చేసుకున్నాడు జక్కన్న..!
గతాన్ని గుర్తు చేసుకున్నాడు జక్కన్న..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ-క్రిష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' విజయబావుటా ఎగురవేస్తోంది. కాగా ఈ సందర్భంగా రాజమౌళి దర్శకుడు క్రిష్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి తన మనసులోని మాటను ఓపెన్‌గా చెప్పేశాడు. ఈ చిత్రం అనౌన్స్‌ అయినప్పుడు ఈ చిత్రం తప్పకుండా ఫ్లాప్‌ గ్యారంటీ అనుకున్నాను. ఎందుకంటే బాలయ్యకు ఉన్న ఇమేజ్‌కు, ఇప్పటివరకు క్రిష్‌ చేసిన చిత్రాలకు మద్య ఏమాత్రం పొంతనలేదు. కానీ క్రిష్‌ స్టోరీ చెప్పిన తర్వాత నాలో పాజిటివ్‌ ఓపీనియన్‌ రావడం మొదలైంది, బాలయ్యకు తగ్గ ఎమోషన్‌ ఉండటం, భార్యా, తల్లిల సెంటిమెంట్‌ కూడా బాగా ఉండటంతో నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన తర్వాత నా మైండ్‌ బ్లాంక్‌ అయింది. నాలా ఈ చిత్రాన్ని ఫ్లాప్‌ అని భావించిన ఎందరి అభిప్రాయాలనో ఈట్రైలర్‌ మార్చివేసింది. 

ఈ సినిమాను మా అంచనాలకు అందని విధంగా తీసిన క్రిష్‌కు అభినందనలు తెలుపుతున్నాను అని జక్కన్న తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని కేవలం 79రోజుల్లో ఎలా తీయగలిగారు? అని రాజమౌళి క్రిష్‌ను ప్రశ్నించగా, ముందు మీరు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పండి..? అంటూ క్రిష్‌ సరదాగా జక్కన్నను ప్రశ్నించాడు. ఇక రాజమౌళి దర్శకుడు వినాయక్‌ గురించి కూడా తాజాగా ఓ విషయం చెప్పాడు. వినాయక్‌ బాలకృష్ణ నటించిన 'చెన్నకేశవరెడ్డి'ని దర్శకత్వం చేస్తున్నాడు. ఆ సమయంలో సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరకు వచ్చినా ఓ పాట షూటింగ్‌ మాత్రం పూర్తి కాలేదు. దాంతో ముందు సినిమాను విడుదల చేసి, ఆ తర్వాత సాంగ్‌ను యాడ్‌ చేద్దామనుకున్నాడట. 

కానీ సినిమాకు ఫ్లాప్‌ టాక్‌ రావడంతో వినాయక్‌ ఎంతో ఆందోళన చెందానని నాకు చెప్పుకొచ్చాడు. అప్పుడు బాలకృష్ణ వినాయక్‌ దగ్గరకు వచ్చి నీవు 100శాతం ఈ సినిమా కోసం కష్టపడ్డావా? అని అడిగాడట. దానికి వినయ్‌ కూడా అవును అని సమాధానం ఇచ్చిన తర్వాత నేను కూడా 100శాతం కష్టపడ్డాను. నీ పనితీరు కూడా నాకు నచ్చింది. ఇక జయాపజయాలు మన చేతిలో లేవు. వదిలెయ్‌... నీతో మరో సినిమా చేస్తానని చెప్పడం తనకు ఎంతో ఊరటనిచ్చిందని వినయ్‌ నాకు అప్పడు ఉద్వేగంగా చెప్పాడు.. అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు జక్కన్న. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ