పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని డాలి డైరెక్ట్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన మరోమారు శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక 'కాటమరాయుడు' చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసి సంక్రాంతికి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేస్తామని చెప్పింది చిత్ర యూనిట్. అయితే కొన్ని కారణాల వల్ల ఆ టీజర్ ని ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక పవన్ కూడా అటు రాజకీయాల్లో బిజీ అవడం కారణంగానో లేక మరేదైనా కారణంగానో మళ్ళీ ఈ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల డేట్ మారిపోయింది. అయితే ఈ నెల 26న 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కావడం లేదని పవన్ కల్యాణే స్వయంగా ట్వీట్ చేసాడు. ఇక అతిత్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తామని చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ పోస్టర్ కే పిచ్చెక్కిపోయిన పవన్ అభిమానులు.... ఇక టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా... అని ఎదురు చూస్తున్నారు. పాపం మళ్ళీ టీజర్ రిలీజ్ వాయిదా పాడడం తో ఫ్యాన్స్ ఉసురుమంటున్నారని సమాచారం.