Advertisementt

టైటిల్ పై క్లారిటీ ఇవ్వని హీరో..!

Mon 23rd Jan 2017 05:50 PM
mahesh babu,director murugaadas,mahesh intelligence officer in thi film,mahesh and murugaadas combination movie  టైటిల్ పై క్లారిటీ ఇవ్వని హీరో..!
టైటిల్ పై క్లారిటీ ఇవ్వని హీరో..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో బైలింగ్యువల్ మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటెలీజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ కి జోడిగా నటిస్తుంది. మరి మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించడం అంటే ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండే ఈ చిత్రంపై  అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా ఉంటుందో అని మహేష్ ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అసలు మహేష్ బాబు కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ని దీపావళి కానుకగా విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ అది జరగలేదు. ఇక న్యూ ఇయర్ కానుకగా వస్తుందేమో అని ఆశపడ్డ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే మిగిలింది. 

మరో పక్క ఇంతవరకు టైటిల్ విషయంలో మురుగదాస్ గాని మహేష్ గాని పెదవి విప్పడం లేదు. ఆ మధ్యన సోషల్ మీడియాలో 'సంభవామి' అనే టైటిల్ తెగ హల్ చల్ చెయ్యగా... ఆ టైటిల్ మహేష్ కి అంతగా బావుండదని ఫ్యాన్స్ గొడవ చేసిన విషయం తెలిసిందే. అయితే మహేష్ - మురుగదాస్ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా అయినా విడుదల చేస్తారని ప్రచారం జరిగినా కూడా ఇంతవరకు చడీ చప్పుడు లేకపోవడంతో ఇప్పుడు కూడా ఫస్ట్ లుక్ విడుదలయ్యే ఛాన్స్ లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ చిత్రం ఎలాగూ వచ్చే జూన్ లోకి విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసుకుంది కాబట్టి మార్చ్ లో ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ