మెగా స్టార్ చిరంజీవి సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అనతికాలంలోనే హీరోగా చక్రం తిప్పి టాప్ 1 పొజిషన్ కి వచ్చేసాడు. ఇక టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా చాలా సంవత్సరాలే ఎలాడు. ఇక సినిమాల్లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న టైమ్ లోనే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రంగాన్ని ఒంటి చేత్తో చక్రం తిప్పినట్టే రాజకీయాలను కూడా గుప్పెట్లో పెట్టుకుందామని ఆశపడి బొక్క బోర్లా పడ్డాడు. రాజకీయాల్లో అడుగడుగునా దిగజారిపోయి.... ఇక సినిమా రంగమే కరెక్ట్ అనుకుని మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాల్లో గతంలో ఎలా నెంబర్ 1 అనిపించుకున్నాడో.... మళ్లీ తొమ్మిదేళ్ల గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చాక కూడా తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని 'ఖైదీ నెంబర్ 150' తో రుజువు చేసాడు.
ఇక సినిమాల్లో రీఎంట్రీతోనే మళ్లీ తన పవర్ చూపిస్తున్న చిరు 151వ సినిమాని కూడా లైన్లో పెట్టాడనే వార్తలొస్తున్నాయి. ఈ సినిమా రామ్ చరణ్ నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయనున్నాడట. ఇక ఈ సినిమాతోపాటే బోయపాటి చిత్రాన్ని కూడా బావ అల్లు అరవింద్ నిర్మాణంలో చెయ్యనున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇక తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరు డాన్సుల్లో, నటనలో చూపిన గ్రేస్ అంతా ఇంతా కాదు. అంత లాంగ్ గ్యాప్ లోనూ చిరు ఫిజిక్ ని బాగా మెయింటింగ్ చేసి సినిమాల్లో కుర్రాడిలా కనబడానికి బాగా ట్రై చేసాడు. ఇక 'ఖైదీ...' సినిమాలో అక్కడక్కడా చిరు ఏజ్ కనబడుతుందని కామెంట్స్ వచ్చిన తరుణంలో చిరంజీవి రాబోయే సినిమాల్లో మరింత స్లిమ్ గా కనబడానికి బాగా జిమ్, డైట్ ఫాలో అవుతున్నాడట.
ఇక ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతూ ... అతి కష్టమైనా డైట్ ఫాలో అవుతున్నాడని చిరు సన్నిహితులు చెబుతున్నారు. మరి చిరంజీవి కమిట్ అయితే అలాగే వుంటుందని అంటున్నారు అందరూ. తనని తానూ మార్చుకోవడానికి చిరు బాగా కష్టపడుతున్నాడని.... ఇక సినిమాల్లోనే స్థిరపడాలనే ఆలోచనలో చిరు ఉన్నట్లు సమాచారం.