బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా సంచలనం రేపుతున్న హాట్ భామ ప్రియాంక చోప్రా. అదే కోవలో దీపికా పదుకొనె, దిశా పాట్నీ, అమైరా దస్తూర్ ఇంకా.. తాజాగా హ్యూమా ఖురేషి... ఇలా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు క్యూ కడుతున్న అందాల భామల జాబితా రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఈ మధ్య మన మీడియా వారికి ఓ సందేహం వచ్చింది. అదేంటంటే.. కేవలం హీరోయిన్లు మాత్రమే ఎందుకు హాలీవుడ్ వెళ్తున్నారు, హీరోలెందుకు వెళ్ళడం లేదంటూ అనుమానం కలిగింది. అనుమానం వచ్చిందే తడవుగా.. ఆ మధ్య ప్రియాంకా చోప్రాని ఈ విషయంపై ప్రశ్నించగా.. హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే ఎంతైనా గట్స్ (దమ్ము) అవసరం అని వ్యాఖ్యానించినట్లు ముంబయ్ మీడియా అంతా కోడై కూసింది. ఆ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదుగానీ ఆ విషయాన్ని పట్టుకొని ప్రియాంకపై నానా రభస చేసింది. అయితే ఈ విషయం చివరకి ప్రియాంకకు తెలిసింది. నానా రభస చేసిన మీడియాపై ప్రింయాక స్పందిస్తూ.. తాను గట్స్ అన్న పదాన్ని వాడనే లేదని, ఎందుకు ఆ విషయంపై అంత యాగీ చేశారో తెలియదని ఆ భామ స్పష్టం చేసింది.
అసలు ఆ విషయంపై ప్రియాంక ఎలా స్పందించిందో తెలుపుతూ... బాలీవుడ్ నటీమణులే హాలీవుడ్ లో నటిస్తున్నారు, నటులు హాలీవుడ్‌లో ఎందుకు నటించడం లేదని తనను అడిగారని, అందుకు తాను... బాలీవుడ్ నటులు అక్కడ నటించేందుకు గట్టిగా ప్రయత్నం చేయడం లేదనుకుంటాను అని మాత్రమే తాను వివరించానని తెలిపింది. అంతేగానీ... తాను గట్స్ అన్న పదాన్ని ఏమాత్రం ఉపయోగించలేదనీ.. అది అసలు ఎక్కడ నుండి వచ్చిందో కూడా తనకు తెలియదని తెలిపింది. ఇంకా ప్రియాంక మాట్లాడుతూ... ఎప్పుడూ వక్రీకరించినట్లుగానే ఈ మీడియా తన భావాన్ని వక్రీకరించినట్లుగా ఆమె స్పష్టం చేసింది. ఇంకా ప్రియాంక స్పిందిస్తూ.. అనిల్ కపూర్, ఇర్ఫాన్‌ఖాన్ హాలీవుడ్‌లో నటిస్తున్నారు, అదే విధంగా మిగతావాళ్లు కూడా ప్రయత్నిస్తే.. విజయం తప్పకుండా వరిస్తుందని వెల్లడించింది. అంతేగానీ ప్రయత్నమే చేయకుండా అవకాశాలు రావాలంటే ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి చాలా కష్టంతో కూడుకున్న విషయమని తెలిపింది. చివరగా ప్రియాంక స్పందిస్తూ.. ప్రయత్నించు.. ప్రయత్నిస్తూనే ఉండు... ఏదో ఒక రోజు విజయానికి చేరుకుంటావ్... అంతేగానీ ప్రయత్నమే చేయకపోతే విజయం ఎలా వరిస్తుందన్నది తన సిద్ధాంతంగా ఆ భామ చెప్పుకొచ్చింది.