అల్లు అరవింద్ వేసిన ఎత్తేమిటీ?, దానికి నాగబాబు చెక్ పెట్టడమేమిటీ? అంటే దీని వెనుక చాలా కథ ఉంది. చేతిలో చిరంజీవి లాంటి వెపన్ పెట్టుకుని చక్రం తిప్పే అల్లు అరవింద్ 'ఖైదీ..' సినిమా లెక్కలు విప్పి ఇండస్ట్రీలో 'ఓన్లీ స్టార్ మెగాస్టార్' అని చెప్పే ప్రయత్నం చేశాడు. దీని ఉద్దేశం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సంకేతాలు పంపడమే అని ఆయన అభిమానులు అనుమానించారు. మెగా కుటుంబానికి దూరంగా ఉన్న పవన్ ను ఏకాకి చేయడం అల్లు వారి ఉద్దేశం. మెగా వేడుకల్లో అభిమానులు చేస్తున్న జిందాబాద్ లకు చెక్ పెట్టడం మరో ఉద్దేశం. అలాగే చిరు కుంటుంబానికి అండగా నిలవడం మరో లక్ష్యం. అయితే అల్లు వారి తీరును నిశితంగా గమనించిన తమ్ముడు నాగబాబు మాత్రం సర్దుకున్నారు. చిరంజీవి కుటుంబం విడిపోవడం అనేది ఆయనకు ఇష్టం లేదు. పవన్ మనస్తత్వం, ఆయన భావాలు వేరు.
కేవలం ఆ కారణంగానే పవన్, చిరుకు దూరంగా ఉంటున్నారనేది నాగబాబు భావన. ఈ దూరం మరింత పెరిగితే మంచి కాదని కూడా ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అందుకే పవన్ కు మళ్లీ సన్నిహితంగా ఉండే అవకాశం కోసం చూస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్ అండగా నిలవడం ఆయనకు కలిసివచ్చింది. తన కుమారుడు వరుణ్ తేజతో మద్దతు చెప్పించాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తను కూడా తమ్ముడు పవన్ అభిప్రాయలతో ఏకీభవిస్తూ ట్వీట్ చేశాడు. జనసేన పార్టీ జండాని తన ప్రొఫైల్ గా పెట్టుకున్నాడు. ఇది అభిమానులు సంతోషించే విషయమే.
ఇక అల్లు వారి అంచనాలు తప్పాయి. స్టార్ గా, జనసేన నేతగా పవన్ ను ఒంటరి చేయాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కుటుంబ స్పర్థలను అభిమానుల మధ్య స్పర్థలుగా మార్చాలనే ఆయన ఆలోచనకు చెక్ పడింది.