Advertisementt

రాజమౌళి ఇక మొదలుపెట్టాడుగా..!

Thu 26th Jan 2017 08:49 PM
director raja mouli,hero prabhas,heroine anushka,baahubali 2 poster  రాజమౌళి ఇక మొదలుపెట్టాడుగా..!
రాజమౌళి ఇక మొదలుపెట్టాడుగా..!
Advertisement
Ads by CJ

'బాహుబలి 1' చిత్రంతో తెలుగు చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి మరోసారి 'బాహుబలి పార్ట్ 2' తో ప్రేక్షకులను కనువిందు చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. వచ్చే ఏప్రిల్ లో ప్రభంజనం సృష్టించడానికి వస్తున్న 'బాహుబలి పార్ట్ 2' తో అపుడే పబ్లిసిటీ ని మొదలెట్టేసాడు రాజమౌళి. ఆ పబ్లిసిటీలో భాగంగా ఈ రోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో 'బాహుబలి 2' పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో హీరో ప్రభాస్, అనుష్క దివి నుండి భువికి దిగివచ్చిన దేవతామూర్తుల్లా వెలిగిపోతున్నారు ఇద్దరూ. ఇక ఈ పోస్టర్ తో బాహుబలి మళ్ళీ  తన రికార్డులను తానె తిరగరాసేందుకు  సిద్ధమైనదని అర్ధమైపోతుంది. 

'బాహుబలి పార్ట్ 1' వచ్చి అప్పుడే ఏడాదిన్నర కావొస్తున్నా బాహుబలి పై అంచనాలు అలాగే వున్నాయి. గత రెండున్నరేళ్లుగా రాజమౌళి ఫ్యామిలీతో పాటే హీరో ప్రభాస్ కూడా తమ సమయాన్ని బాహుబలికి వెచ్చించారు. ఆ కష్టానికి ప్రతి ఫలం వీరికి పూర్తిగా దక్కడానికి మరెంతో సమయం లేదు అన్నట్లు కనబడుతుంది ఈ 'బాహుబలి' పోస్టర్. ప్రభాస్, అనుష్క ఇద్దరు కలిసి విల్లు ఎక్కుపెట్టిన ఈ పోస్టర్ చూస్తుంటే ప్రభాస్ అభిమానులకే కాదు అందరికి పిచ్చెక్కిపోతుంది. అసలు రాజమౌళి స్టామినా గురించి వేరే చెప్పకర్లేదు. తెలుగువారు గర్వపడేలా చిత్రాలను తెరకెకెక్కించడంలో రాజమౌళికి సాటిలేరని మరొక్కసారి రుజువు చేసే ఈ పోస్టర్ చూస్తుంటే 'బాహుబలి' చిత్రం విడుదలయ్యే వరకు ఏమాత్రం ఓపిక పెట్టేలా లేరు సినీ ప్రేమికులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ