Advertisementt

అతడితో ఎఫైర్ నిజమేనని చెప్పిన భామ.!

Sat 28th Jan 2017 02:19 PM
bollywood,heroine deepika padukone,love affair,tv live show interview,hollywood actor vin diesel,triple x movie  అతడితో ఎఫైర్ నిజమేనని చెప్పిన భామ.!
అతడితో ఎఫైర్ నిజమేనని చెప్పిన భామ.!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హాట్ సుందరి దీపికా పడుకొనే ఎట్టకేలకు తన ఎఫైర్ పై స్పందించింది.  మొత్తానికి తాజాగా ఈ హాట్ భామ ఓ టీవీ లైవ్ షోలో పాల్గొని మాట్లాడుతూ.. ఆ హీరోతో తనకు ఎఫైర్ ఉందన్న విషయాన్ని అమ్మడు అలా చాలా తేలికగా ఒప్పేసుకుంది. తన ఎఫైర్ విషయంపై అమ్మడు స్పందిస్తూ...  అవును నిజమే తన మధ్య ఆ విషయం నడుస్తుంది అనడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.  ఈ మధ్య  ఆయనంటే తనకు చాలా ఇష్టం..తనతో కలిసి పిల్లలను కనాలని ఉంది అని వెల్లడిస్తూ.. నానా హంగామా చేసింది ఈ గ్లామర్ భామ. అయితే తాజాగా దీపికా పడుకొనే నటించిన హాలీవుడ్ ‘ట్రిపుల్ ఎక్స్’ చిత్రం మంచి క్రేజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ఇంతటి భారీ క్రేజ్ ను సంపాదించుకున్న దీపికా ఓ టివి లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నది. 

ఈ కార్యక్రమంలో నిర్వహకురాలు అడిగిన ప్రశ్నకు దీపికా టకీమని సమాధానం చెప్పేసింది. ఎంతైనా హాలీవుడ్ కదా మరి అంతా మైమరచి చెప్పేయాలి మరి. అక్కడి ఆలోకంలోకి వెళ్తే ఎవ్వరైనా అలాగే మూడు మార్చుకుంటారేమో తెలియదు గానీ, దీపికను హోస్ట్ మీరు హాలీవుడ్ యాక్టర్ విన్ డీజిల్ తో రొమాన్స్ జరిపినట్లుగా ఒప్పుకుంటారా? అన్న ప్రశ్నను అడుగగా.. అవును.. నిప్పు లేనిదే పొగ రాదుకదా? అంటూ టకీమని సమాధానం చెప్పి అక్కడి వారినందరినీ షాక్ కు గురి చేసింది దీపికా. అయితే దాదాపు గంటకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో దీపిక వెల్లడించిన విషయాలన్నీ చాలా పచ్చిగానే ఉన్నట్లు తెలుస్తుంది. దిపికా పడుకొనే మొత్తానికి విన్ డీజిల్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. అంతే కాకుండా అతడితో రొమాన్స్ లో పాల్గొన్నానన్న విషయాన్ని కూడా చెప్పి అందరు అవాక్కయ్యేలా చేసిందీ బాలీవుడ్ గడుసు సుందరి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ