Advertisementt

హీరోలు తమ భార్యలను పొగిడేస్తున్నారు..!

Sat 28th Jan 2017 09:52 PM
jr ntr,ram charan,upasana,chiranjeevi,hari krishna,ram charan house re design  హీరోలు తమ భార్యలను పొగిడేస్తున్నారు..!
హీరోలు తమ భార్యలను పొగిడేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

చరణ్‌ నిన్నమొన్నటి వరకు ప్రతి విషయానికి రెచ్చిపోయి... మీడియాను సైతం వెంట్రుకతో పోల్చిన సంగతి తెలిసిందే. కాగా పెళ్లి తర్వాత మాత్రం ఆయనలో చాలా మార్పు వచ్చి మెచ్యూరిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. 'ధృవ' చిత్రం సందర్భంగా ఆయన మీడియా సపోర్ట్‌ను ఎంతో మెచ్చుకున్నాడు. తాజాగా ఆయన తాను ఇప్పుడే పిల్లల గురించి ఆలోచించడం లేదని, తాను ఇంకా చిన్నపిల్లవాడినేనని భావిస్తున్నానని, తనలో ఇంకా మెచ్యురిటీ రావాల్సివుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వీటికి అద్దం పడుతున్నాయి. కాబట్టి మొదట నన్ను నేనే హ్యాండిల్‌ చేసే పరిపక్వత వచ్చిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తున్నానన్నాడు. ఇక ప్రస్తుతం మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా తమ ఇంటిని రీడిజైన్‌ చేస్తున్నామని, తన తండ్రి ఎప్పటి నుంచో ఇంటిలో కొన్నిమార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నాడన్నాడు. 

ఉపాసన కూడా తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని రీడిజైన్‌ చేస్తోందని తెలిపాడు. కాగా ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన జీవితంపై తన అమ్మ తర్వాత మరలా అంతటి ప్రభావాన్ని తన భార్య చూపిందని తెలిపాడు. ఆమె వల్ల తనకు చాలా విషయాల్లో మెచ్యూరిటీ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆయన గతంలో మీడియాతో పాటు తన అభిమానుల విషయంలో కూడా అనవసర అసహనం చూపించేవాడు. కానీ నేడు మాత్రం ఆయన హుందాగా ప్రవర్తిస్తున్నాడు. షూటింగ్‌ సమయంలో ఎంతో దూరం నుండి వచ్చిన అభిమానులకు ఉండే చిన్నకోరిక అయిన ఫొటో దిగాలనే దానికి ఆయన సమయం వెచ్చిస్తున్నాడు. తనని సరిగా పట్టించుకోకపోయినా బాబాయ్‌ బాలకృష్ణతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నాడు. ఇక చరణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్దరు తమ బాడీ ఫిట్‌నెస్‌ విషయంలో, లుక్‌ల విషయంలో తమ భార్యలు చూపిస్తున్న శ్రద్దకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ