Advertisementt

ఈ యాంకర్ షాక్ తో మైండ్స్ బ్లాక్..!

Mon 30th Jan 2017 02:28 PM
anchor lasya,anchor ravi,lasya engagement,raja meeru keka movie,heroine lasya  ఈ యాంకర్ షాక్ తో మైండ్స్ బ్లాక్..!
ఈ యాంకర్ షాక్ తో మైండ్స్ బ్లాక్..!
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన లాస్య కొత్తగా ‘రాజా మీరు కేక’  సినిమాలో హీరోయిన్ గా రాబోతుంది. స్నేహితుడు అయిన యాంకర్ రవి తో కలిసి బుల్లితెర మీద చెయ్యని షో అంటూ లేదు. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ  పలు రకాల గాసిప్స్ మీడియాలో షికార్లు చేశాయి. ఇక ఏ షో లో వాళ్లు గెస్ట్ లు కింద వెళ్లినా కూడా మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారటగా... అని అడగగా లేదు మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే మా మధ్యన ఏం లేదని చెప్పేవారు. ఆ గాసిప్స్ ని రవి, లాస్యాలు ఇద్దరు ఖండించేవారు.  అయితే కొద్దీ రోజులనుండి లాస్య ఉన్నట్టుండి బుల్లితెర మీద కనబడం మానేసింది.

అలా బుల్లితెర మీద సడన్ గా లాస్య మాయమయ్యే సరికి ఆమెకి ఏదో అయ్యిందని... వేరే ఎవరితో ప్రేమాయణం నడుపుతుందని అబ్బో ఒకటేమిటి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అప్పుడు లాస్య తెర మీదకి వచ్చి నాకేం కాలేదని... నేను ఎవరితో ప్రేమలో లేనని .... ‘రాజా మీరు కేక’  సినిమాతో హీరోయిన్ గా మీకు చేరువవుతానని చెప్పుకొచ్చింది. మళ్ళీ కొంచెం సైలెంట్ అయిన లాస్య సడెన్ గా ఇప్పుడు తన సోల్మెట్ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఓ ప్రత్యేకమైన రోజు కోసం రెడీ అవుతుండడం చాలా సంతోషంగా ఉంది. నా సోల్మెట్ తో నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నా. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది అంటూ లాస్య నిన్న సోషల్ మీడియా ద్వారా అందరికి చెప్పి ఆశ్చర్యపరిచింది.

ఇక సోల్మెట్ అంటుంది గాని అతని వివరాలేమీ బయట పెట్టలేదు లాస్య. ఇక ఈ రోజు ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ ఫోటో ని చూస్తుంటే లాస్య హాస్యం చెయ్యడం లేదు నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందనేలా ఉందా ఫోటో. మీరు ఆ ఫోటో ని ఓ లుక్కేయండి.  అంటే లాస్య తన ఎంగేజ్మెంట్ జరగబోతుందని చెప్పిన మాట వాస్తవమేనన్నమాట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ