Advertisementt

మూడో క్యారెక్టర్ హీరోయిన్ కోసం వేట..!

Mon 30th Jan 2017 03:18 PM
jr ntr,director babi,producer kalyan ram,rakul preet singh,jai lava khusha movie  మూడో క్యారెక్టర్ హీరోయిన్ కోసం వేట..!
మూడో క్యారెక్టర్ హీరోయిన్ కోసం వేట..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్  - డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం ఫిబ్రవరి 10న లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుని  వచ్చే నెల15 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మాత. కళ్యణ్ రామ్, ఎన్టీఆర్ కోసం ఒక టైటిల్ ని కూడా రిజిస్టర్  చేయించాడని ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్ రామ్ రిజిస్టర్ చేయించిన 'జై లవ కుశ' టైటిల్ ఎన్టీఆర్ చిత్రానికే అంటూ వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి కానీ... ఇంత వరకు కళ్యాణ్ రామ్ ఆ వార్తలని ధ్రువీకరించలేదు. ఇకపోతే ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు పాత్రలు చేయనున్నాడని సమాచారం.  ఇక ఈ మూడు పాత్రలకి ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనల్ చెయ్యాలి కాబట్టి ఇప్పటికే ఇద్దరిని సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. 

ఆ ఇద్దరిలో 'జెంటిల్మెన్' ఫేమ్ నివేద థామస్ కాగా మరో హీరోయిన్ గా రాశి ఖన్నాని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇక మూడో హీరోయిన్ ని ఎంపిక చెయ్యాల్సి ఉన్నట్లు ఆమె కోసం వేట ప్రారంభించినట్లు  సమాచారం. మరి ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనబడతాడని... ఒక పాత్ర యాక్షన్ క్యారెక్టర్ కాగా.... మరో పాత్రలో కామెడీ క్యారెక్టర్ లో కాగా... మూడో పాత్రని మాత్రం విలన్ గా చేయనున్నాడనే వార్తలు వినబడుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ