Advertisementt

ఆమె శారీతో అందరిని వావ్... వావ్ అనిపిచ్చింది!

Mon 30th Jan 2017 05:55 PM
samantha,naga chaitanya,engagement,samantha sarie,nagarjuna,akhil,shreyabhupal  ఆమె శారీతో అందరిని వావ్... వావ్ అనిపిచ్చింది!
ఆమె శారీతో అందరిని వావ్... వావ్ అనిపిచ్చింది!
Advertisement
Ads by CJ

సమంత - నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నిన్న రాత్రి అతికొద్దిమంది సన్నిహితుల మధ్య హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నాగ చైతన్య, సమంత ల నిశ్చితార్ధ వేడుకని నాగార్జున, అమల తమ చేతుల మీదుగా జరిపించారు. ఇక హిందూ సంప్రదాయంలో నిశ్చితార్ధ  వేడుకని జరిపించి వెనువెంటనే క్రైస్తవ ఆచారం ప్రకారం కూడా ఈ వేడుకని జరిపించేసారు. ఇక పెళ్లి కూడా ఇదే పద్దతిలో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల పద్దతిలోనే జరుగుతుందని చైతూ ఎప్పుడో చెప్పాడు. ఇక ఈ వేడుకలో అఖిల్ తన కాబోయే భార్య శ్రియ భూపాల్ తో సందడి చేసాడు. అయితే నాగ చైతన్య తన ఎంగేజ్మెంట్ కి బ్లూ  కలర్ సూట్ లో రాగా... సమంత మాత్రం తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న బంగారు వర్ణపు అంచు కలగలిపిన తెల్లటి చీరలో మెరిసింది. ఇక ఈ చీరని ముంబైకి చెందిన క్రేషా బజాజ్‌ డిజైన్‌ చేశారు.

ఇక సమంత కట్టుకున్న ఆ చీరకి ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే సమంత, నాగ చైతన్యని మొదటిసారి  కలిసినప్పటినుండి ఇప్పటి వరకు జరిగిన ప్రత్యేక సందర్భాలను గుర్తుండిపోయేలా తన చీర అంచు మీద ఆ ఫొటోస్ ని డిజైన్ చేయించుకుంది సమంత. ‘ఏమాయ చేశావే’ సినిమాలో ఓ సన్నివేశంతో మొదలైన సమంత - చైతన్యల పరిచయం..... బైక్‌పై  నాగ చైతన్య , సమంతలు కలిసి ఉన్నప్పటి ఫోటో, అలాగే ఒక ఉంగరంతో సమంత తన వేలిని చూపెడుతుండగా... చైతన్య బీచ్ లో షర్ట్ లేకుండా ఉన్న ఫోటో ని..... ఇటీవల తాజాగా అఖిల్‌ నిశ్చితార్థ వేడుకలో తీయించుకున్న ఫోటో.. ఇలా అన్నీ ఆ చీర అంచు మీద బంగారు రంగుతో డిజైన్ చేయించుకుని చై.. పై తనకున్న ప్రేమను చాటుకుంది సామ్. అలాగే ఇప్పుడు అందరికళ్ళు ఆమె కట్టిన ఆ బంగారు అంచు తెల్లని చీర మీదే వున్నాయి. మొత్తానికి సమంత తన ఎంగేజ్మెంట్ లో తన చీరతోనే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గ నిలిచింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ