Advertisementt

మన హీరోలు కూడా మారుతున్నారు...!

Wed 01st Feb 2017 11:56 AM
tollywood heroes,mind set,jr ntr,chiranjeevi,balakrishna,manchu manoj  మన హీరోలు కూడా మారుతున్నారు...!
మన హీరోలు కూడా మారుతున్నారు...!
Advertisement
Ads by CJ

వాస్తవానికి అందరి హీరోలకు వ్యక్తిగతంగా మంచి స్నేహసంబంధాలే ఉంటాయి. కానీ వారి అభిమానులు మాత్రం ఆ విషయంలో అనవసరంగా రెచ్చిపోతుంటారు. తాజాగా చిరంజీవి.. శర్వానంద్‌ను ఎంతో ఎంకరేజ్‌ చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఆయన శ్రీకాంత్‌, రవితేజ వంటి వారికి కెరీర్‌ ప్రారంభంలో మంచి ప్రోత్సాహం ఇచ్చాడు. మరోపక్క దాసరి చిరు నటించిన 'ఖైదీ..' చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. బాలయ్య చిత్రం ఓపెనింగ్‌కి చిరు వచ్చాడు. చిరుని బాలయ్య, బాలయ్య చిరులను ఎంతో అభిమానిస్తారు. ఇటీవలే మహేష్‌బాబు విదేశాల్లో ఉన్న సమయంలో రామ్‌చరణ్‌ ఆయనతో ఫొటో దిగి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ తాజా చిత్రం 'జవాన్‌' ఓపెనింగ్‌కు హాజరయ్యాడు. మరోపక్క సాయిధరమ్‌తేజ్‌తో కలిసి చిరంజీవి-మోహన్‌బాబులు కలిసి నటించిన 'బిల్లారంగా' చిత్రం చేయాలని భావిస్తున్నామని మంచు హీరో తెలిపిన సంగతి కూడా తెలిసిందే. మన ఇండస్ట్రీలోని పలువురు హీరోలు బాలయ్య 'గౌతమీపుత్ర...', చిరు 'ఖైదీ...' చిత్రాల సందర్భంగా వారిని పొడుగుతూ తమ అభిమానం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ తనతో 'ఊసరవెల్లి, శక్తి' చిత్రాలలో నెగటివ్‌ పాత్రల్లో అలరించిన విద్యుత్‌జమాల్‌కు హీరోగా కూడా మంచి హిట్‌ రావాలని ఆకాంక్షించాడు. విద్యుత్‌జమాల్‌, ఆదాశర్మల కాంబినేషన్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న 'కమాండో2'కి బెస్ట్‌ విషెష్‌ చెప్పిన సంగతి కూడా విదితమే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ