Advertisementt

బండ్ల ఇకనైనా మారు..!

Wed 01st Feb 2017 09:06 PM
bandla ganesh,pawan kalyan,ravi teja,sachiin jose  బండ్ల ఇకనైనా మారు..!
బండ్ల ఇకనైనా మారు..!
Advertisement
Ads by CJ

చిన్నచిన్న కామెడీ రోల్స్‌ నుంచి, 'ప్లీజ్‌.. ఆంటీ' వంటి బూతు చిత్రాలలో కూడా నటించిన నటుడు బండ్లగణేష్‌. కాగా ఈయన పౌల్ట్రీ, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలలో తాను కోట్లు సంపాదించానని, తన తండ్రి కూడా కోటీశ్వరుడని తెలిపాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి పలువురు స్టార్స్‌తో చిత్రాలు తీసి 'బ్లాక్‌బస్టర్‌' నిర్మాతగా పేరుపొందాడు. కానీ ఆయన ఎంత వేగంగా స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగాడో, అంతే వేగంగా కనుమరుగయ్యాడు. తాను పనిచేసిన ఎన్టీఆర్‌, రవితేజల నుంచి సచిన్‌జోషి వరకు అందరితో వైరం పెట్టుకున్నాడు. తాజాగా తన ఓ చిత్రం ఫ్లాప్‌కి దర్శకుడిని బాధ్యుడిని చేస్తున్నాడు. నిర్మాతగా టేస్ట్‌లేని, సినిమాలపై పట్టులేని ఆయన నిర్మాత కావడం దురదృష్టం. కేవలం డబ్బులు పెట్టి, ఖరీదైన గిఫ్ట్‌లను దర్శకహీరోలకు ఇచ్చి, కులం కార్డును వాడుకుంటూ, కేవలం క్రేజీ కాంబినేషన్లపై మాత్రమే దృష్టి పెట్టి, టేబుల్‌ ప్రాఫిట్స్‌ను దండుకోవడం, క్రేజీ కాంబినేషన్లకు ఉండే క్రేజ్‌ను మాత్రమే క్యాష్‌ చేసుకోవాలని చూస్తూ, తనను నమ్మిన హీరోలను, దర్శకులను, చివరకి బయ్యర్లను కూడా నిలువునా ముంచి, కర్చీఫ్‌ ప్రొడ్యూసర్ గా మారిన ఆయన నిర్మాతగా అనర్హుడు. 

కానీ ఆయన ఒక్కడే కాదు.. ఇండస్ట్రీలో పలువురు నిర్మాతలు ఇదే కోవకి చెందిన వారే కావడం దురదృష్టం.ఇక ఆయన బొత్సకి బినామీ అనే పేరుతో పాటు డబ్బుల విషయంలో ఎందరినో ఛీటింగ్‌ చేశాడనే విమర్శలు కూడా ఉన్నాయి. నిజానికి ఆయనపై అమ్మాయిల బ్రోకర్‌ అనే విమర్శ కూడా ఎప్పటి నుంచో ఉంది. పవన్‌కళ్యాణ్‌తో నటించిన హీరోయిన్‌ మీరాచోప్రా సైతం అప్పట్లో బండ్లపై ఇలాంటి కామెంట్సే చేసి, పలువురి ఆగ్రహానికి గురై, ఆ ట్వీట్స్‌ను కొందరి బలవంతం మీద డిలైట్‌ చేసిందనే వార్తలు కూడా ఉన్నాయి. తాజాగా గణేష్‌ తనపై అమ్మాయిల బ్రోకర్‌ అనే అపవాదుపై స్పందిస్తూ.. అలాంటి వార్తలు ఎందుకు వ్యాపించాయో తనకు అర్థం కావడం లేదని, తాను అలాంటి వాడిని కాదని వివరణ ఇచ్చాడు. మరి దీనిని ఎందరు నమ్ముతారో? చూడాలి. ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన వారైతే బాగా వివరిస్తారు... అనేది మాత్రం వాస్తవం. అయితే ఇలాంటి విషయాలు చాలామంది కామన్‌గా చేసేవేనని.. కేవలం గణేష్‌ని మాత్రమే తప్పుపట్టాల్సిన పనిలేదని కొందరు చేస్తున్న కామెంట్లలో కూడా నిజం ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ