Advertisementt

యంగ్‌టైగర్‌ ఫస్ట్...చిరుకు 10వ స్థానం..!

Sat 04th Feb 2017 11:56 AM
jr ntr,chirajeevi,khaidi no 150,google survey,best dancer  యంగ్‌టైగర్‌ ఫస్ట్...చిరుకు 10వ స్థానం..!
యంగ్‌టైగర్‌ ఫస్ట్...చిరుకు 10వ స్థానం..!
Advertisement
Ads by CJ

ఇండియన్‌ చిత్రాలలో పాటలకు, స్టెప్‌లకు, డ్యాన్స్‌లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. నిన్నటితరంలో మిథున్‌చక్రవర్తి, గోవిందా నేటితరంలో హృతిక్‌రోషన్‌లకు ఎంతో పేరుంది. ఇక దక్షిణాదిలో కేవలం పాటల కోసం, అందులో తమ అభిమాన హీరో వేసే డ్యాన్స్‌ల కోసమే ఎందరో అభిమానులు చూసిన చిత్రాలనే మరలా చూస్తూ మురిసిపోతుంటారు. కోలీవుడ్‌కి చెందిన ప్రభుదేవాకి ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా దేశవాప్తంగా పేరుంది. ఆ తర్వాత లారెన్స్‌ కూడా ఆయన దారిలోనే నడిచాడు. అయితే వీరిద్దరు స్వతహాగా కొరియోగ్రాఫర్లు కావడం విశేషం. ఇక కేవలం హీరోల విషయానికి వస్తే మన టాలీవుడ్‌ హీరోలు పాటలకు, డ్యాన్స్‌లకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. స్వర్గీయ ఏయన్నార్‌ నుండి అఖిల్‌ వరకు, స్వర్గీయ ఎన్టీఆర్‌ నుండి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు మనలను డ్యాన్స్‌లతో అలరిస్తునే ఉన్నారు. ఇక త్వరలో వెండితెరపై తెరంగేట్రం చేయబోతున్న నందమూరి మోక్షజ్ఞ సైతం ఇప్పుడు నటనలో మరీ ముఖ్యంగా డ్యాన్స్‌లపై ప్రత్యేక శ్రద్దపెడుతున్నాడట. తెలుగులో డ్యాన్స్‌లను సరికొత్త పుంతలు తొక్కించిన వారిలో మెగాస్టార్‌ చిరంజీవి అతి ముఖ్యుడు. ఆయన తెలుగు పాటల్లో స్నేక్‌డ్యాన్స్‌, బ్రేక్‌డ్యాన్స్‌లతో పాటు సరికొత్త ఒరవడికి తెరతీశాడు. ఆయన మెగాస్టార్‌ కావడంలో ఆయన డ్యాన్స్‌లు కీలకపాత్రను పోషించాయి. అయనకున్న అభిమానుల్లో ఎక్కువ మంది ఆయన డ్యాన్స్‌కు మైమరిచినవారే. ఇక 60ఏళ్లు దాటిన ఈ వయసులో కూడా ఆయన తన 'ఖైదీ' చిత్రంలో డ్యాన్స్‌లతో మెస్మరైజ్‌ చేసి, తానెందుకు డ్యాన్స్‌కింగ్‌నో మరోసారి నిరూపించాడు. అయితే ఆయన తన వయసు దృష్ట్యా ఈ చిత్రంలో మంచి మూమెంట్స్‌ వేసినప్పటికీ క్లిష్టమైన మూమెంట్స్‌ను దూరం పెట్టాడని కూడా విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ వయసులో కూడా ఆయన ఆ స్థాయిలో డ్యాన్స్‌ చేయడమంటే మాటలు చెప్పినంత, విమర్శలు చేసినంత సులభం కాదు. 

తాజాగా గూగుల్‌ ఇండియాలో బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరు? అని ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియాలోనే మొదటి స్థానం యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు లభించింది. హృతిక్‌రోషన్‌కి రెండో స్థానం, బన్నీకి మూడో స్థానం, ప్రభుదేవాకు నాలుగోస్థానం, లారెన్స్‌కు ఐదో స్థానం దక్కాయి. ఇక మెగాస్టార్‌ చిరుకి 10వ స్థానం, రామ్‌చరణ్‌కు 17వ స్థానం దక్కాయి. ఈ ఫలితాలతో నందమూరి యంగ్‌టైగర్‌ అభిమానులు ఎంతో సంబరపడిపోతున్నారు. మరోపక్క మెగాభిమానులు చిరుకు 10 వస్థానం దక్కడంతో ఈ సర్వే మొత్తాన్ని బూటకం అంటున్నారు. నిజానికి ఇక్కడ ఎన్టీఆర్‌, చిరుల అభిమానులు ఓ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. తెలుగునాట డ్యాన్స్‌లకు క్రేజ్‌ తెచ్చింది చిరంజీవే. కానీ ఈ వయసులో కూడా ఆయన అంత బాగా డ్యాన్స్‌లు వేయడం ఆయనకే చెల్లింది. కానీ నేటి యంగ్‌హీరోలతో ఆయనను పోల్చకూడదు. కాబట్టి నేడున్న వారిలో యంగ్‌టైగరే తన వయసు రీత్యా మంచి డ్యాన్స్‌ చేయగలడు. ఇలా చిరు, జూనియర్‌లు ఎవరి తరంలో వారు గొప్పవారే. ఈ వాస్తవాన్ని అందరూ గ్రహించాలి....!