షారుఖ్, అమీర్, సల్మాన్‌ల మద్య బాలీవుడ్‌లో తీవ్రపోటీ ఉన్నప్పటికీ వీరి ముగ్గురి మధ్య మంచి అండర్‌స్టాడింగ్ ఉంది. వీరు ముగ్గురి భావాలు, మతాలు ఒకటే కావడం కూడా దానికి కారణం అనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తమ చిత్రాలు తమకే పోటీ కాకుండా ఈ ముగ్గురు కలసి పనిచేస్తూ ఉంటారు. హృతిక్‌తో పాటు మిగిలిన వారిని టార్గెట్ చేసినంతగా ఈ స్టార్స్ వారికి వారు మాత్రం కలహించుకోకుండా తామే బాలీవుడ్‌ని శాసించాలని చూస్తుంటారు. వారిలో వారు పోటీ పడినా, తమ ముగ్గురిలోనే ఎవరో ఒకరు టాప్‌లో ఉండాలని, ఇతరులను మాత్రం ఎదగనీయకూడదనే రాజకీయాలు చేస్తుంటారు. ఇక ఇప్పటికే షారుఖ్ నటించిన పలు చిత్రాలలో స్నేహం కోసం సల్మాన్‌భాయ్ అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తూ వచ్చాడు. వీరిద్దరు ఒకప్పుడు 'కరణ్ అర్జున్' వంటి మల్టీస్టారర్ కూడా చేశారు. ఇక కింగ్‌ఖాన్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై, ఓం శాంతి ఓం, హమ్ తుమ్హారే సనన్' వంటి చిత్రాలకు కండలవీరుడు గెస్ట్‌గా కనిపించి, భారీ చేయూతనిచ్చాడు. కానీ ఇప్పటివరకు కింగ్‌ఖాన్ మాత్రం సల్మాన్ చిత్రాలలో కనిపించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం కింగ్‌ఖాన్ కూడా సల్మాన్ తాజా చిత్రంలో కీలకపాత్రకు ఒప్పుకుని, తాను సైతం అని ముందుకు వచ్చాడు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్' చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి కబీర్‌ఖాన్ దర్శకుడు. ఈ చిత్రం ఇండో-చైనా వార్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులోని ఓ కీలకపాత్రను పోషించడానికి షారుక్ ఒప్పుకోవడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇలాంటి ఐకమత్యాన్నే మన స్టార్స్ కూడా చూపిస్తే బాగుంటుంది.