పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. ఈయన మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. కానీ ఆయన 'గబ్బర్‌సింగ్' తర్వాత మరో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయలేదు. ఆ తర్వాత ఆయన చేసిన 'అత్తారింటికి దారేది', 'గోపాలా.. గోపాలా' వంటి చిత్రాలలో ఆయన క్లాస్‌గా కనిపించాడు. తద్వారా ఆయన ఫ్యామిలీ, క్లాస్, విభిన్న చిత్రాలను కోరుకునే వారిని అలరించాడు. ఇక 'సర్ధార్‌గబ్బర్‌సింగ్'లో మరోసారి మాస్ చిత్రం చేయాలని భావించినప్పటికీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచి ఆయన అభిమానులను నిరుత్సాహపరిచింది. దీంతో పవన్ తాజాగా చేస్తున్న 'కాటమరాయుడు'తోనైనా ఆయన తమ దాహార్తిని తీరుస్తాడా? అని మాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కానీ ఇది తమిళ 'వీరం'కి రీమేక్ అనే ప్రచారం సాగుతుండటం, అదే నిజమని అందరూ భావిస్తున్న తరుణంలో ఈ చిత్రం నుండి దర్శకునిగా ఎస్.జె.సూర్య తప్పుకోవడం వంటి పరిణామలతో ఆయన అభిమానులు సందిగ్దంలో పడిపోయారు. అందునా పెద్దగా అనుభవం లేని డాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండటం, ఆయన గతంలో 'తడాఖా' మినహా అన్ని చిత్రాలను పెద్దగా మాస్ ఎంటర్‌టైనర్స్‌గా తీయలేకపోవడం, మరోసారి అనూప్‌రూబెన్స్‌తో పనిచేస్తుండంతో నిజంగానే ఆయన వీరాభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. కానీ ఈ చిత్రం టీజర్ మాత్రం ఆ అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. మాస్ అవతార్‌లో పవర్‌స్టార్ రెచ్చిపోయాడు.
కోరమీసం, పంచెకట్టు, తనదైన చిందులు, ఒకే ఒక్క పవర్‌ఫుల్ డైలాగ్, కొన్ని యాక్షన్ షాట్స్‌ను టీజర్‌లో చూస్తుంటే ఈ చిత్రం మెగాభిమానుల కోరికను తీర్చనుందని స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ టీజర్‌తో మాస్‌లో రచ్చ.. రచ్చను పవన్ క్రియేట్ చేశాడు. ఈ చిత్రం పక్కామాస్ ఎంటర్‌టైనర్ కావడం, 'గబ్బర్‌సింగ్' తర్వాత మరోసారి శృతిహాసన్ ఇందులో పవన్‌కి జోడీగా కనిపించనుండటం విశేషం. ఇక పవన్‌కు తెలుగు రాష్ట్రాలలోని అన్ని మాండలికాలలోో అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. తాజాగా ఈ చిత్రంలో ఆయన రాయలసీమ యాసతో చెప్పే డైలాగ్స్ ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌గా నిలవనున్నాయని విశ్వసనీయ సమాచారం.