పాత కాలంలో అంజలీదేవి, సావిత్రి, జమునా, భానుమతి వంటి వారు ఎలాంటి గ్లామర్‌షో లేకుండానే స్టార్‌హీరోయిన్లుగా చెలామణి అయ్యారు. ఇక ఆ తర్వాత కూడా జయసుధ, సుహాసిని, భానుప్రియ వంటి వారు అదే తరహాలో రాణించారు. కాగా గత 20ఏళ్లుగా చూసుకుంటే గ్లామర్‌షో చేయకుండానే స్టార్‌హీరోలు, టాప్‌హీరోలలో ఎక్కువ మందితో నటించిన సౌందర్య మాత్రమే స్టార్‌హీరోయిన్‌గా నిలబడిన ఘనతను సొంతం చేసుకుంది. తర్వాత కూడా నిత్యామీనన్ వంటి వారు గ్లామర్‌షో చేయకపోయినా వారు కేవలం హీరోయిన్లుగా నిలబడగలిగారే గానీ టాప్‌హీరోయిన్లు కాలేకపోయారు. ఇక తాజాగా మరో మలయాళ బ్యూటీ, 'నేను... శైలజ'తో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అలాంటి సాహసాన్ని చేయాలని ప్రయత్నిస్తోంది. నేటికాలంలో గ్లామర్ ప్రపంచంలో నీలిచిత్రాలను కూడా ఇంటర్‌నెట్‌లోచూసుకుని, తమ జేబులో ఉన్న సెల్‌ఫోన్లతోనే అలాంటి వాటిని చూడగలిగిన కాలంలో, సన్నిలియోన్,మల్లికాషెరావత్‌తో పాటు ఎలాంటి హద్దులు లేకుండా నటించడానికి, ఐటం గర్ల్స్‌గా మారడానికి కూడా మన హీరోయిన్లు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో కీర్తిలాంటి వారు నిజంగా స్టార్‌హీరోయిన్స్‌గా నిలబడగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కీర్తి సురేష్ ధనుష్, విజయ్ వంటి కోలీవుడ్ స్టార్స్‌తో కూడా నటించింది. త్వరలో పవన్, మహేష్, బన్నీ, సూర్య వంటి వారితో కలిసి నటించనుంది. కానీ తాజాగా విడుదలైన 'నేను.. లోకల్' వరకు ఆమె ధనుష్, విజయ్‌ల చిత్రాలలో కూడా కనీసం నడుము కూడా చూపించలేదు. తన పద్దతి మార్చుకోకుండా నిండుగా కనిపిస్తూనే మాయ చేస్తోంది. నేటితరం హీరోయిన్లకు అందం, అభినయంతో పాటు గ్లామర్‌షో కూడా ముఖ్యమేనని పలువురు హీరోయిన్లతో పాటు మేకర్స్, ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. పాటల్లో కూడా గ్లామర్‌షోకు కీర్తి నో అంటోంది. మరి ఆమె ఇలా ఎంతకాలం నెగ్గుకురాగలదు? ఇలా కెరీర్ మొదట్లో పద్దతిగా కనిపించిన హీరోయిన్లు ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో గ్లామర్‌షోకి కూడా ఓకే అన్న సందర్బాలు అనేకం ఉన్నాయి. దీనికి నయనతార, అనుష్క, రకుల్‌ప్రీత్, కాజల్, తమన్నా వంటివారిని ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ కీర్తి అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదని, కావాలంటే ఇంట్లో ఖాళీగా ఉంటానే గానీ అలాంటి వాటికి తాను దూరం అనే కండీషన్‌ను హీరోలకు, దర్శకనిర్మాతలకు ముందుగానే చెబుతోందని అంటున్నారు. మరి కీర్తి గ్లామర్‌షో లేకుండానే ఆ కీర్తి సాధించగలదా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది...!