మన ప్రజలకు, హీరోలకు, అభిమానులకు కూడా ఎప్పుడు ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు, మనోభావాలు ఎందుకు ఎప్పుడు దెబ్బతింటాయో అర్ధం కాదు. తాజాగా పవన్ నటించిన 'కాటమరాయుడు' టీజర్ విడుదలై సంచలనాలను సృష్టిస్తోంది. కాగా పవన్‌కి వీరాభిమాని అయిన నితిన్ ఈ చిత్రం టీజర్‌ను చూసి స్పందించాడు. ఆయన సోషల్ మీడియాలో ఆ చిత్రం మొదటి టీజర్ సృష్టిస్తున్న ప్రభంజనం చూసి 'రాయుడులు ఎంతమంది ఉన్నా కాటమరాయుడు' ఒక్కడే అంటూ ట్వీట్ చేశాడు. కాగా గతంలో తెలుగులో మోహన్‌బాబు 'పెదరాయుడు', వెంకటేష్ 'చినరాయుడు' వంటి పేర్లతో చిత్రాలు చేశారు. కానీ మోహన్‌బాబు 'పెద' రాయుడు, అంటే వెంకీ 'చిన' రాయుడు అన్నాడు. కానీ అప్పుడు మాత్రం వీరిద్దరి మనోభావాలతోపాటు వీరి అభిమానుల మనోభావాలు మాత్రం దెబ్బతినలేదు.
కానీ పవన్ 'కాటమరాయుడు' గురించి చేసిన ట్వీట్‌తో ఆయా హీరోలు, వారి అభిమానుల ఆత్మగౌరవం దెబ్బతినడంతో ఇంకేముంది నితిన్‌ను బూతులు తిడుతూ విమర్శిస్తున్నారు. దాంతో ఆయన సీనియర్లను అవమానించే ఉద్దేశ్యంతో తాను ఆ ట్వీట్ చేయలేదని ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలి.. సారీ.. 'అంటూ క్షమాపణ చెప్పాడు. సినిమాలను సినిమాలుగా, కేవలం ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తూ స్పోర్టివ్‌గా తీసుకోకుండా ప్రతిదానికి ఇలా విమర్శిస్తూ పోవడం ప్రమాదకర సంకేతమనే చెప్పాలి.