Advertisementt

రానా... ప్రభాస్ నమ్మకం కూడా అదే..!

Mon 06th Feb 2017 12:27 PM
rana daggubati,prabhas,baahubali 2,director sankalp reddy,ghazi movie  రానా... ప్రభాస్ నమ్మకం కూడా అదే..!
రానా... ప్రభాస్ నమ్మకం కూడా అదే..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో కొన్ని చిత్రాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. కాగా 'బాహుబలి'లో భళ్లాల దేవగా నటించిన ఆయన ప్రభాస్‌ కంటే ఎక్కువగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటిస్తున్న 'బాహుబలి2' చిత్రం ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంతో రానాకు మరింత పేరు రావడం ఖాయం. కాగా ఇంతకాలం సోలోహీరోగా సరైన హిట్‌లేని ఈ దగ్గుబాటి వారబ్బాయి 'ఘాజీ' చిత్రంతో ఆ లోటును కూడా పూడ్చుకుంటాడనే నమ్మకం వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా ఈ చిత్రం బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పీరియాడికల్‌ మూవీస్‌కు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో 1971లో ఇండో - పాక్‌ యుద్దం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. 

పూర్తిగా నీటి అడుగున చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ అత్యద్భుతంగా హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రం ఇండియాలోనే తొలి సబ్‌మెరైన్‌ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని సంకల్ప్‌ రెడ్డి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడంటే ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన తర్వాత నమ్మలేకపోతున్నారు. 'ఘాజీ' విషయంలో అనేక ప్రచారాలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఈ జలాంతర్గామిని మన ఇండియన్‌ నావికా సైన్యమే పేల్చేసిందనే వాదన బలంగా ఉంది. కానీ ఇండియన్‌ నేవీ ఆఫీసర్స్‌ నుంచి ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని ఎప్పుడు దృవీకరించలేదు. దాంతో ఈ చిత్రం క్లైమాక్స్‌ కోసం ఏకంగా దర్శకరచయిత సంకల్ప్‌రెడ్డి ఐదు క్లైమాక్స్‌ వెర్షన్‌ను రాసుకున్నాడట. 

వాటిని చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ రచయితలు, దర్శకులకు వాటిని చెప్పి, వాటిల్లో బెస్ట్‌ చాయిస్‌ను ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో 'ఘాజీ'ని మన నావికాదళమే మట్టుబెట్టినట్లు చూపించనున్నారని సమాచారం. కాగా వైవిద్యచిత్రాలను ఆదరించే ఓవర్‌సీస్‌లో ఈ చిత్రం ఖచ్చితంగా మంచి వసూళ్లు సాధించడం గ్యారంటీ అని ట్రేడ్‌పండితులు విశ్లేషిస్తున్నారు 'క్షణం' తర్వాత పివిపి సంస్ధ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ ఈ చిత్రం ఓవర్‌సీస్‌హక్కులను రెండు కోట్లకు సొంతం చేసుకున్నాడని సమాచారం. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం ఈనెల 17న భారీగా విడుదలకానుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ