Advertisementt

ఈ సారి రవితేజ- గోపీచంద్‌ల వంతు..!

Mon 06th Feb 2017 05:59 PM
ravi teja,ntr,gopi chand,new director chekri,sampath nandi,gautam nanda movie  ఈ సారి రవితేజ- గోపీచంద్‌ల వంతు..!
ఈ సారి రవితేజ- గోపీచంద్‌ల వంతు..!
Advertisement
Ads by CJ

సినిమా ఫీల్డ్‌లో ఒకరి కోసం తయారు చేసిన కథలు వేరొక్కరికి వెళ్లడం మామూలే. అలా హిట్టయిన చిత్రాలు అనేకం ఉన్నాయి. పవన్‌ సినిమాలు రవితేజకు, మహేష్‌కు.. వారు చేయాల్సిన కథలు వేరొక్కరికి వెళ్లాయి. ఇక తాజాగా రవితేజ చేయాల్సిన చిత్రం ఎన్టీఆర్‌కు, ఎన్టీఆర్‌ చేయాల్సిన చిత్రం రవితేజకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రవితేజ నటించాల్సిన ఓ చిత్రం గోపీచంద్‌ వద్దకు వచ్చిందని తెలుస్తోంది.'బెంగాల్‌టైగర్‌' తర్వాత రవితేజ ఎందరో దర్శకులు చెప్పిన కథలు విన్నాడు. వాటిల్లో కొత్త దర్శకుడైన చక్రి చెప్పిన కథ మాస్‌మహారాజాకు బాగా నచ్చింది.

దానికి 'రాబిన్‌హుడ్‌' అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. కానీ రవితేజ ఆ తర్వాత ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. తాజాగా ఇదే కథను దర్శకుడు చక్రి గోపీచంద్‌కు చెప్పాడని తెలుస్తోంది. ఈ కథ గోపీచంద్‌కు కూడా బాగా నచ్చడంతో త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాడట. ఇప్పటికే ఆయన సంపత్‌నందితో చేస్తున్న 'గౌతమ్‌నంద' చిత్రం షూటింగ్‌ కూడా పూర్తయింది. దీంతో చక్రి సినిమాను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం గోపీచంద్‌ సొంత నిర్మాణ సంస్థ అయిన భవ్యఆర్ట్స్‌ బేనర్‌పై రూపొందే అవకాశం ఉంది. ఇక భవ్యఆర్స్‌ అధినేతలు బాలకృష్ణ నటించనున్న 101వ చిత్రాన్ని కూడా నిర్మించనున్న సంగతి తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ