మెగా మల్టీస్టారర్ చిత్రం మొదలవ్వబోతుందా? అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి. అసలు సుబ్బరామిరెడ్డి ఈ మెగా మల్టి స్టారర్ చిత్రాన్ని... నేను, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్నామని చెప్పగానే... ఏదో సుబ్బరామిరెడ్డి పబ్లిసిటీ కోసమే అలా ప్రకటించాడు అని అనుకున్నారు అంతా. కానీ ఆ సినిమాకి సంబందించిన స్టోరీ లైన్ ని అప్పుడే త్రివిక్రమ్ మెగా బ్రదర్స్ కి వినిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాకి భారీ బడ్జెట్ నే పెడుతున్నారని ప్రచారం కూడా మొదలయ్యింది. అసలు బడ్జెట్ మాట అటుంచి.... ఈ సినిమాలో నటించే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల రెమ్యునరేషన్ గురించి అప్పుడే ఒక గాలి వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంది.
ఈ మెగా మల్టి స్టారర్ చిత్రంలో నటించడానికి చిరంజీవి దాదాపు 25 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. మరి తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు 25 కోట్లు తీసుకుంటుంటే మంచి ఫామ్ లో వున్న పవన్ కూడా 25 కోట్లు ఈ మెగా మల్టి స్టారర్ కి తన రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని టాక్ ప్రచారంలోకి వచ్చింది. మరి కేవలం మెగా బ్రదర్స్ మాత్రమే ఇంతగా ఛార్జ్ చెయ్యడం లేదు... ఈ సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా దాదాపు 15 కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం సోషల్ మీడియాలో బయలు దేరింది.
మరి హీరోలకి, దర్శకుడికే 65 కోట్ల బడ్జెట్ అంటే ఇక ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ ఉంటుందో అనేది ఊహిస్తుంటే...అమ్మో అనిపిస్తుంది కదా!. మరి ఈ బడ్జెట్ ఎంత ఉంటుంది అనే ఫిగర్ ఇప్పటివరకు బయటకు రాలేదు. మరి మెగా మల్టిస్టారర్ అంటే మామూలు విషయం కాదు అంటున్నారు మెగా ఫ్యాన్స్. కేవలం మెగా మల్టి స్టారర్ ప్రకటనకే ఈ రేంజ్ లో అంచనాలు మొదలైతే ఇక ఈ సినిమా పట్టాలెక్కేసరికి ఈ అంచనాలు అందుకోవడం ఎవ్వరి తరం కాదేమో అని కాలరెగరేస్తున్నారు మెగా ఫ్యాన్స్..