ప్రస్తుతం బుల్లితెర హవా బాగా నడుస్తోంది. వెండితెరపై అవకాశాలు సంపాదించే క్రమంలో చాలా మంది బుల్లితెరను వేదికగా మార్చుకుంటున్నారు. దీనిలో తప్పుపట్టాల్సిన విషయం ఏమీ లేదు. వారు తామనుకున్న లక్ష్యాలను కూడా సాధిస్తున్నారు. అనసూయ, రేష్మి, శ్రీముఖి, లాస్య, రవి, సుధీర్, ప్రదీప్ వంటి వారు.. 'జబర్దస్త్' ద్వారా టాలెంట్ చూపిస్తున్న కమెడియన్లకు కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. గతంలో కూడా ఉదయభాను, ఝూన్సీ వంటి వారు కూడా ఆ కోవకే చెందుతారు. అయితే ఇక్కడ మీడియా ఓ విషయాన్ని విస్మరిస్తోంది. ఇలా పలు యాంకర్లు తమ షోలలో వెకిలిచేష్టలు చేస్తూ వార్తల్లోకి వస్తున్నారు. రేష్మికి సుధీర్‌కి ఎఫైర్ ఉన్నట్లుగా పలు సందర్భాలలో వారిని చూసేవారికి అనుమానం వచ్చేలా చేయగలిగారు. ఇక లాస్య-రవిల సంగతి కూడా అంతే. ప్రదీప్ అయితే ఓ పబ్‌లో తాగి గొడవ చేసిన విషయం మీడియాలో వచ్చింది. ఇక తమకు వస్తున్న పేరుతో ధన్‌రాజ్, చలాకి చంటి, చమ్మక్ చంద్ర వంటి వారిపై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. చమ్మక్‌చంద్ర అయితే తనకున్న పలుకుబడితో కొందరు అమ్మాయిలకు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, మోసం చేశాడనే ఫిర్యాదులు వచ్చాయి. ఇక బుల్లితెరను అడ్డుపెట్టుకున్న అందరూ తమ చేష్టలతో వార్తల్లో నిలుస్తున్నారు.
లాస్యతో రవికి ఎఫైర్ ఉందని, కానీ రవి.. శ్రీముఖితో ఎఫైర్ నడుపుతుండటంతో లాస్య.. రవికి బ్రేకప్ చెప్పి, సూసైడ్ చేసుకోబోయిందనే వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ పబ్లిసిటీ ద్వారా లాస్య కూడా వార్తల్లో నిలిచి త్వరలో విడుదల కానున్న 'రాజా..మీరు కేక' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక రవితో శ్రీముఖి చేసే వెకిలి చేష్టల వల్ల ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌లాంటి పాత్రలు చేసిన శ్రీముఖికి హీరోయిన్లుగా ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరైతే తమకు ఫలానా యాంకర్‌తో ఎఫైర్ ఉందని ఇన్‌డైరెక్ట్‌గా, రహస్యంగా మీడియాకు ఉప్పందిస్తున్నారు. దీంతో జర్నలిస్ట్‌లు కూడా అలాంటి వాటిని హైలైట్ చేస్తూ, వారి క్రేజ్‌ను పెంచుతున్నారు. అది పక్కనపెడితే తాజాగా రవి తనకు లాస్యతో ఎఫైర్ ఉందనే విషయాన్ని ఖండిస్తూ, ఆమెకు ఇప్పటికే మరాఠికి చెందిన మంజునాథ్‌తో పెళ్లి ఫిక్స్ అయినా కూడా తాను ఆమెతో టచ్‌లోనే ఉంటున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా అతను నోరు జారాడు. కావాలనే తాము బుల్లితెర స్క్రీన్లపై ముందుగా అనుకొనే ముద్దులు, తన్నుకోవటాలు చేస్తామని, బయటి ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు కూడా ముందుగా నిర్ణయించుకుంటామన్నాడు.
ఇలాగే రేష్మి విషయంలో కూడా సుధీర్ అలాగే స్పందించాడు. పైపెచ్చు తమకు మీడియాలో రూమర్లు రావడానికి మీడియానే కారణమని, వారికి బుద్దిలేదని, అయినా తమకు ఫ్రీగా పబ్లిసిటీ చేసి తమను పెద్దవాళ్లను చేస్తున్నారని మీడియాపై కస్సుమన్నారు. మరి వీరి విషయంలో మీడియా అలాంటి వారి ఉచ్చులో పడకుండా అలాగే వదిలేసి, స్పందించకుండా ఉండటమే మేలు అని ఇప్పటికైనా మీడియా వారు, జర్నలిస్ట్‌లు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.