యాంకర్ అనసూయ బుల్లితెర మీద గ్లామర్ షో తో ప్రేక్షకులని మత్తెక్కించి ఇప్పుడు వెండితెర మీద కూడా ఒక ఊపు ఊపడానికి రెడీ అయిపొయింది.అనసూయ ఇప్పటికే 'సోగ్గాడే చిన్నినాయనా, క్షణం' చిత్రాలతో వెండితెర మీద తానేమిటో నిరూపించుకుని ఇప్పుడు ఏకంగా ఐటెం గర్ల్ గా అవతారమెత్తింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'విన్నర్' చిత్రంలో అనసూయ ఐటెంలో ఆడనుందని తెలిసిన విషయమే. ఇక అనసూయ ఐటెం సాంగ్ లో నటిస్తుందని తెలుసు గాని ఆ సాంగ్ లో అనసూయ ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుందో అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు.
అంతలా అనసూయ అభిమానులు ఎదురు చూడడానికి కారణం కూడా ఉంది. ఈ మధ్యన అనసూయ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తుంది. మరి ఆ రకమైన అందాల ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్స్ లోనే రెచ్చిపోతే ఇక ఐటెంలో ఎంతలా.. రెచ్చిపోతుందో అని ఎదురు చూస్తున్నారు. ఇక 'విన్నర్' ఐటెం సాంగ్ లో అనసూయ అందాలు చూపించి చూపించినట్టు ఒక మేకింగ్ వీడియోతో పాటు ఆ సాంగ్ ని యూట్యూబ్లో విడుదల చేసాడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. 'విన్నర్'లో ఒక్కో పాటని ఒక్కో సెలెబ్రిటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఆ మేకింగ్ వీడియోలో అనసూయ అందాలు చూస్తుంటే కుర్రకారుకి పిచ్చెక్కిపోవడం ఖాయం. జస్ట్ మేకింగ్ వీడియో లోనే అనసూయ అలా ఉంటే ఇక ఆ సాంగ్ లో అనసూయ ఎలా ఉంటుందో ఊహించేసుకుని మరీ లొట్టలేసేస్తున్నారు. ఇక అనసూయ టాప్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శనకి దిగినట్లు ఆ మేకింగ్ వీడియో చూస్తుంటే అర్ధమవుతుంది. అనసూయ ఐటెం సాంగ్ మాత్రమే ఈ 'విన్నర్' కి స్పెషల్ కాదు ఈ ఐటెం సాంగ్ 'సుయ.. సుయ... అనసూయ' అనే సాంగ్ ని యాంకర్ సుమ పాడింది. సుమ ఇప్పటిదాకా ఒక్క యాంకరింగ్ మాత్రమే చేసింది. ఇక ఇప్పుడు 'విన్నర్' తో సింగర్ గా కూడా అవతారమెత్తింది. మరి ఒక హాట్ యాంకర్ ఐటెం సాంగ్లో డాన్స్ తో రెచ్చపోగా... మరో యాంకర్ తన సింగింగ్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు.