మొన్నామధ్యన తెలుగులో నటించాలంటే తెలుగు వచ్చి ఉండాలని... ఒకవేళ తెలుగు రాకపోతే మొహంలో హావభావాలను పలికించడం కష్టం కాబట్టి తెలుగులో ఇక నటించకపోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయి చిత్రాలతో 90వ దశకంలో ఒక ఊపు ఊపిన ఈ హీరో కొంతకాలం సినిమాలకి దూరమయ్యాడు. అయితే చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ తమిళంలో 'తని ఒరువన్' చిత్రంతో విలన్ గా సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమా ఏ రేంజ్ హిట్టో అందరికి తెలిసిందే. అదే చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ 'ధృవ'గా రీమేక్ చేసాడు. అయితే తెలుగులో కూడా అరవింద్ స్వామి, రామ్ చరణ్ కి విలన్ గా నటించి కేక పుట్టించాడు.
మళ్లీ 'ధృవ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అరవింద్ స్వామి 'ధృవ' చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యాక అరవింద్ స్వామి తెలుగులో మరిన్ని సినిమాలు ఒప్పుకుంటాడేమో అని అనుకున్నారు. కానీ అరవింద్ మాత్రం తెలుగు భాష రాదు కాబట్టి తెలుగులో నటించడం అనేది కొంత సమస్యే అని చెప్పాడు.
అయితే ఇప్పుడు అరవింద్ స్వామి తమిళంలో నటించిన మరో మూవీ తెలుగులో రీమేక్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఆ మూవీలో అరవింద్ మళ్లీ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తాడని అంటున్నారు. అరవింద్ స్వామి - జయం రవి తాజాగా నటించిన 'బోగన్' చిత్రం తమిళంలో గత వారం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'బోగన్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. జయం రవి, హన్సిక హీరో హీరోయిన్స్ గా నటించిన 'బోగన్' లో అరవింద్ స్వామి ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించాడని... ఇక తెలుగు రీమేక్ లో కూడా ఆరోల్ ని అరవిందే చేస్తాడని అంటున్నారు. అయితే తెలుగు రీమేక్ నిజంగా ఉంటే తాను అందులో నటించడానికి నో చెప్పక పోవచ్చని అంటున్నాడు అరవింద్ స్వామి. అంటే అరవింద్ తెలుగులో మరొకసారి నటిస్తానని చెప్పకనే చెప్పినట్లు లేదూ...!