Advertisementt

'సింగం 3 ' షోలన్నీ ఇక్కడ క్యాన్సిల్.!

Thu 09th Feb 2017 12:44 PM
s3 movie,suriya s3 movie,s3 telugu states shows cancel,post pone,morning shows cancel  'సింగం 3 ' షోలన్నీ ఇక్కడ క్యాన్సిల్.!
'సింగం 3 ' షోలన్నీ ఇక్కడ క్యాన్సిల్.!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సీక్వెల్ గా తీసిన చిత్రం సింగం 3. ఈ చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం సింగం 3 చిత్రం తెలుగులో ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల కారణంగా విడుదల ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఈరోజు విడుద‌ల కావాల్సిన సింగం 3 తెలుగు వెర్ష‌న్ ఇంకా విడుద‌ల కాలేదు. అందుకని మార్నింగ్ షోల‌న్నీ క్యాన్సిల్ చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దాంతో హైద‌రాబాద్ లోని మార్నింగ్ షోలన్నీ ర‌ద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా సాంకేతిక కార‌ణాల వ‌ల్లనే జంట న‌గ‌రాల్లో సింగం 3 విడుద‌ల కావ‌డం లేద‌ని, ఈ విషయానికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే చెబుతామని చిత్ర‌బృందం వెల్లడించింది. కాగా సాయింత్రానికి తొలి షో ప‌డే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా తమిళ‌నాడు, ఓవ‌ర్సీస్‌లోనూ సింగం 3 విడుద‌లై దుమ్మురేపుతుంది. అక్కడ ప్రీమియ‌ర్ షోల‌తోనే పెద్దఎత్తున హ‌డావుడి నెలకొంది. సింగం 3 గురించిన ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి ఇది ఓ హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామా అని మాత్రం తెలుస్తుంది. ఇంకా సూర్య తాలూకూ.. ఫైటింగులు, డైలాగుల కోస‌మైతే సినిమాను మరో ఆలోచన లేకుండా చూడవచ్చని చెబుతున్నారు. పూర్తిగా అసలు చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ