రాజమౌళి 'బాహుబలి పార్ట్ 2' తర్వాత చెయ్యబోయే చిత్రం ఏమిటా... అని అపుడే అందరూ తెగ ఆలోచించేస్తున్నారు. ఇక రాజమౌళి మాత్రం బాహుబలికి తుది మెరుగులు దిద్దేపనిలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. 'బాహుబలి 2' షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో క్షణం తీరికలేకుండా గడుపుతున్న రాజమోళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమౌళి ఎప్పుడో ఒకసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. అది తొందరలోనే ఆ చిత్రాన్ని తీస్తానని కూడా చెప్పాడు. కానీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం తనకొడుకు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ 'మహాభారతం' కాదని క్లియర్ గా చెప్పాడు.
ఇక మళ్లీ రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహాభారతామనే ప్రచారం మొదలైంది. అయితే ఈ చిత్రానికి గాను మూడు భాషల నుండి ముగ్గురు సూపర్ స్టార్స్ ని రాజమౌళి ఎంపిక చేయనున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇక ఆ సూపర్ స్టార్స్ ఎవరో కాదు తమిళం నుండి రజినీకాంత్ కి బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్ కి మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్‌లాల్ కి ఈ పురాణగాథ మహాభారతంలో ముఖ్యమైనపాత్రలని ఆఫర్ చేసే ఆలోచన రాజమౌళి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక మహాభారతాన్ని తెరకెక్కించడానికి రాజమౌళికి ఏకంగా ఆరేళ్ళు పట్టొచ్చని అంటున్నారు. అయితే మహాభారతాన్ని కూడా పార్ట్స్ పార్ట్స్ గా తియ్యాలని రాజమౌళి భావిస్తున్నాడట. ఇక అలా పెద్ద స్టార్స్ గనక ఈ చిత్రానికి పనిచేస్తే మొత్తం ఆరేళ్ళు వాళ్ళ డేట్స్ అడ్జెస్ చెయ్యడం కష్టం కాబట్టి ఒక్కో పార్ట్ కి స్టార్స్ ని మార్చే యోచన కూడా రాజమౌళి చేస్తున్నాడట.
మరి రాజమౌళి ఒక్కసారి అనుకున్నాడంటే దాన్ని ఏదైనా చెయ్యగల కెపాసిటీ ఉన్నోడు. నిజంగా రాజమౌళి మహాభారతాన్ని సెట్స్ మీదకి తీసుకెళితే గనక అది ఎంత పురాణ గాధ అయినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇక అంత భారీగా గనక మాహభారతాన్ని తెరకెక్కిస్తే దాని బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడానికే ఊహకందడం లేదు కదూ...!