Advertisementt

రాజమౌళి కొత్త కాంబినేషన్ కు తెరతీశాడు..!

Fri 10th Feb 2017 02:30 PM
director rajamouli,baahubali 2,hindi heroes,malayalam heroes,tamil heroes  రాజమౌళి కొత్త కాంబినేషన్ కు తెరతీశాడు..!
రాజమౌళి కొత్త కాంబినేషన్ కు తెరతీశాడు..!
Advertisement
Ads by CJ

జక్కన్న ఎస్. ఎస్. రాజమౌళికి తెలిసిన బిజినెస్ సూత్రం మరెవరికీ తెలియదు. తన బ్రాండ్ ఇమేజ్ ను వ్యాపారంగా ఎలా మలుచుకోవాలనే దానికి రాజమౌళి అండ్ ఫ్యామిలీ నిత్యం ఆలోచిస్తుంటుంది. బాహుబలి హడావుడి ముగింపు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త కాంబినేషన్ కు తెరతీశాడు. ఈ సారి హిందీ, తమిళ్, మళయాల హీరోలతో పౌరాణికం తీస్తానని లీకులిచ్చి, చర్చను పెట్టాడు. సోషల్ మీడియా వేదికగా జరిగే చర్చను ఆసక్తిగా గమనించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. 

పౌరాణికం అంటే ప్రపంచ సినిమాకు గుర్తుకువచ్చేసి తెలుగు సినిమాలే. ఎన్నో పౌరాణికాలు అందించిన చరిత్ర తెలుగు సినిమాకు ఉంది. పౌరాణిక పాత్ర పోషణలో తెలుగు నటులకు మరెవరూ సాటిరారనే విషయం అందరికీ తెలిసిందే. ఇది తెలిసిన రాజమౌళి అమీర్ ఖాన్, రజనీకాంత్, మోహన్ లాల్ ప్రధాన పాత్రధారులుగా పౌరాణిక సినిమా ఆలోచన చేయడం ఆయన వ్యాపార ధృక్పదాన్ని తెలియజేస్తోంది.ఈ ముగ్గురు  హీరోలతో తెలుగు సినిమా చేస్తానని చెప్పడం ఆయన తొందరపాటు తనాన్ని తెలియజేస్తోంది. గ్రాఫిక్ ఆధారిత సినిమాలు చేసే జక్కన్న తెలుగు హీరోలకు మరోసారి అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగులో ఎందరో సమర్ధులైన నటులున్నా బాహుబలిలో పరభాష ఆర్టిస్టులకు వేషాలిచ్చారు. ఇప్పుడేమో ఏకంగా తెలుగేతర హీరోలతోనే సినిమా చేస్తానని అంటున్నారు. దర్శకుడిగా ఆయన మేధస్సును ప్రశంసించిన, బిజినెస్ మన్ గా ఆయన చర్యలు మాత్రం సమర్థించే విధంగా లేవు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ