తమని సంప్రదించకుండానే దిల్ రాజు చేసిన ప్రకటన నాగార్జునకు చిరాకు పెట్టింది. దాంతో ఆయన ట్విట్టర్ ద్వారా వ్యంగ్యంగా స్పందించారు. అసలు విషయమేమంటే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించే సినిమాను నిర్మించనున్నట్టు దిల్ రాజు ఏకపక్షంగా ప్రకటించాడు. ఈ వార్త మీడియాలో రావడంతో నాగ్, చైతు ఆశ్చర్యపోయారు. తండ్రి చెప్పాడని కొడుకు, కొడుకు చెప్పాడని తండ్రి అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకున్నపుడు అసలు విషయం తెలిసింది. తమకు సంప్రదించకుండా దిల్ రాజు ప్రకటన చేశాడని. దాంతో నాగార్జున ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశారు. ఇది మీడియాలో ప్రముఖంగా రావడంతో దిల్ రాజు ఇబ్బంది పడ్డాడు. చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. నాగార్జునను కలిసి జరిగిందేమిటో చెప్పాలని ప్రయత్నం చేశాడు. చివరికి 'ఓం నమో వేంకటేశాయ' ప్రివ్యూలో నాగ్, దిల్ రాజు కలుసుకున్నారు. తను చేసిన పొరపాటు గురించి దిల్ రాజు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. నాగార్జున సరదాగా తీసుకున్నారు. ఇలా ఇద్దరి మధ్య దూరం తగ్గింది.