Advertisementt

మరో హీరో దూసుకుపోతున్నాడు...!

Sun 12th Feb 2017 05:25 PM
chiranjeevi,ravi teja,nani,nikhil,raj tarun,vijay devarakonda,director trivikrm  మరో హీరో దూసుకుపోతున్నాడు...!
మరో హీరో దూసుకుపోతున్నాడు...!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు చిరంజీవి, ఆ తర్వాత రవితేజ.. తాజాగా నాని. ఇక వీరితోపాటు నిఖిల్‌, రాజ్‌తరుణ్‌ వంటి హీరోస్ కూడా బిజీగా మారిపోయిన హీరోల లిస్ట్‌లోకి మరో యంగ్‌హీరో కూడా స్ధానం సంపాదిస్తున్నాడు. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌', 'ఎవడేసుబ్రహ్మణ్యం' వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన కుర్రాడు విజయ్‌ దేవరకొండ. ఇక ఈయన జాతకాన్ని ఇటీవల చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన 'పెళ్లిచూపులు' మార్చేసింది. దీంతో ఈ యంగ్‌హీరోకు ఇప్పుడు మంచి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పలు పెద్ద సంస్థల కన్ను కూడా ఈ హీరోపై పడింది. ఆయన ఆర్‌బీ చౌదరి సమర్పణలో తెరకెక్కుతోన్న 'ద్వారకా' చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. 

ఇక కొత్త దర్శకుడితో చేస్తున్న 'అర్జున్‌రెడ్డి' షూటింగ్‌ కూడా పూర్తికావచ్చింది. త్వరలో దర్శకురాలు నందినిరెడ్డి డైరెక్షన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నిర్మించే చిత్రంలో కూడా విజయ్‌ హీరోగా నటించనున్నాడు. అశ్వనీదత్‌ కూతుర్లకు చెందిన త్రీ ఏంజిల్స్‌ బేనర్‌లో ఓ చిత్రం, ప్రముఖ నిర్మాణసంస్థ వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి నిర్మించే మరో మూవీ, సురేష్‌ ప్రొడక్షన్స్‌లో ఈ యువహీరో చేతిలో ఉన్నాయి. ఇక 'గీతాఆర్ట్స్‌2'లో బన్నీవాసు నిర్మాతగా పరుశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. మరి 'పెళ్లిచూపులు' ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఈ యువహీరో ఎంతవరకు నిలబెట్టుకుంటాడో? వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ