Advertisementt

ఇరకాటంలో మహేష్‌ బాబు...!

Tue 14th Feb 2017 12:58 PM
mahesh babu,director murugaadas,baahubali2 movie,shahrukh khan,ajith kumar  ఇరకాటంలో మహేష్‌ బాబు...!
ఇరకాటంలో మహేష్‌ బాబు...!
Advertisement
Ads by CJ

టైటిల్‌, ఫస్ట్‌లుక్‌కే మహేష్‌-మురుగదాస్‌లు నానా హైరానా పడుతున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికీ పూర్తికాలేదు. డిసెంబర్‌ చివరికి పూర్తి చేస్తామని చెప్పినా అది వర్కౌట్‌ కాలేదు. అందునా ఈ చిత్రంతో మహేష్‌ టాలీవుడ్‌నే కాదు... కోలీవుడ్‌, బాలీవుడ్‌లను కూడా టార్గెట్‌ చేస్తున్నాడు. దీంతో షూటింగ్‌ కాస్త ఆలస్యం కావడంలో తప్పేమీ లేదు. ఈ చిత్రాన్ని ఏకంగా సమ్మర్‌ సీజన్‌ను వదిలేసి జూన్‌ 23కి వెళ్లారంటున్నారు. అంటే ఈసారి మహేష్‌ రంజాన్‌ను టార్గెట్‌ చేశాడన్న మాట. ఇక ప్రతి రంజాన్‌కి సల్మాన్‌ఖాన్‌ ఓ సినిమాతో వస్తుంటాడు. తాజాగా ఆయన ప్రతిష్టాత్మకంగా ఓ వాస్తవిక ఘటనతో 'ట్యూబ్‌లైట్‌' చేస్తున్నాడు.

ఇందులో షార్‌ఖ్‌ కూడా మెరవనున్నాడు. ఈ చిత్రం జూన్‌ 25న విడుదల కానుంది. మరి ఆ రోజున సల్మాన్‌ వస్తే రెండు రోజుల ముందే వచ్చే మహేష్‌ చిత్రం హిందీ పరిస్థితి ఏమిటి? అనేది అర్ధం కావడం లేదు. ఇక కోలీవుడ్‌లో కూడా అజిత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 'వివేగమ్‌' ని కూడా మేలో ట్రైలర్‌, ఆడియోలను జరిపి జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. మరి 'బాహుబలి2' తోపోటీ ఎందుకని మహేష్‌ ఆలోచిస్తూ, 'బాహుబలి2'కు ఓ నెల గ్యాప్‌ ఇవ్వాలని భావిస్తున్నాడు. దాంతో ఆయన ఏకంగా జూన్‌ చివరికి వెళ్లిపోయాడని, అంటే ఇప్పటికీ మహేష్‌-మురుగదాస్‌ల దృష్టి కేవలం టాలీవుడ్‌పైనే ఉందని, వారు ఈ చిత్రం తమిళ, హిందీ వెర్షన్స్‌ను పెద్దగా పట్టించుకోకపోవడంతోనే జూన్‌ నెలాఖరుకు వెళ్లారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ