కీర్తి సురేష్ హవా తెలుగులో రోజు రోజుకి పెరిగిపోతుంది. డీసెంట్ గా టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే స్టేజి కి కీర్తి ఎదిగేటట్లే కనబడుతుంది. 'నేను శైలజ'తో హోమ్లీ హీరోయిన్ గా రామ్ పక్కన నటించిన కీర్తి సురేష్ తమిళంలో సూపర్ హిట్స్ తో అక్కడ జెండా పాతేసింది. ఇక అక్కడ స్టార్ హీరోల పక్కన నటిస్తూ ఇటు తెలుగులో కూడా బిజీ అయ్యింది. ఇప్పటి వరకు కీర్తి రెండే రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఒకటి రామ్ తో 'నేను శైలజ' చిత్రం లో... మరొకటి రీసెంట్ గా రిలీజ్ అయిన నాని 'నేను లోకల్' చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు చెప్పుకోదగ్గ హిట్ అయితే కాదుగాని పర్వాలేదనిపించాయి. అయితే కీర్తి తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త చిత్రంలో పవన్ కి జోడిగా ఎంపికైంది.
మరి కీర్తి ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో ఎటువంటి గ్లామర్ ప్రదర్శించలేదు. కేవలం చుడిదార్స్, చీరలు, లంగావోణీ లతోనే సరిపెట్టేసింది. ఎలాంటి అందాల ప్రదర్శనకు దిగకుండానే కీర్తి టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. 'నేను శైలజ'లో అంతే. 'నేను లోకల్' లో కూడా అలాగే ఎటువంటి గ్లామర్ ప్రదర్శించకుండా నటించేసింది. మరి ఇప్పటివరకు ఒకేగానీ ఇకపై.... అందాల ఆరబోతకు ఏమాత్రం ఆలోచించకుండా గ్లామర్ షో చేసే హీరోయిన్స్ ముందు కీర్తి నిలబడగలదా? అనే సందేహం ఇప్పటికే చాలామంది మదిలో మెదులుతుంది. కానీ కీర్తి కేవలం హావభావాలతోనే నెట్టుకొద్దామంటే... అది ఎంతవరకు సాధ్యమనేది ఆలోచించాల్సిన విషయమే. మరి లిప్ లాక్ కిస్సులకి, అందాల అరోబోతకి దూరంగా వుండే కీర్తి ఇతర హీరోయిన్స్ నుండి పోటీ ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. చూద్దాం కొందరిలా మడికట్టుకుని కూర్చుని ఛాన్స్ లు పోగొట్టుకుంటుందా... లేక కొద్దీ కొద్దిగా అందాల ప్రదర్శనకు సై అంటుందా అనేది.