Advertisementt

పాపం....క్రిష్ ....!

Wed 15th Feb 2017 02:28 PM
hero venkatesh,director krish,gautamiputra satakarni movie,athadu adavini jainchadu artical  పాపం....క్రిష్ ....!
పాపం....క్రిష్ ....!
Advertisement
Ads by CJ

దర్శకుడు క్రిష్‌కు ప్రతి విషయంలోనూ ఆదిలోనే హంసపాదులు ఎదురవుతున్నాయి. ఆయన గతంలో వరుణ్‌తేజ్‌తో స్పైథ్రిల్లర్‌గా 'రాయబారి' చిత్రం తీయాలనుకున్నాడు. కానీ ఆ చిత్రం మూలనపడింది. ఇక 'గౌతమీపుత్ర...' మంచి విజయం సాధించడంతో ఆయన రేంజ్‌ మారడం ఖాయమనే వార్తలు వినిపించాయి. ఆయన్ను పిలిచి మరీ విక్టరీ వెంకటేష్‌ తన ప్రతిష్టాత్మక 75వ చిత్రాన్ని క్రిష్‌ చేతుల్లో పెట్టడంతో ఆయన అభిమానులు ఎంతగానో సంతోషించారు. ఇప్పటికే క్రిష్‌ ఈ చిత్రం సబ్జెక్ట్‌ను తయారు చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు. కానీ ఆయనకు ఈ చిత్రం విషయంలో కూడా అనుకోని అవాంతరం ఎదురైందని సమాచారం. ఆయన వెంకీ చిత్రాన్ని 'అతడు అడవిని జయించాడు' అనే నవల ఆధారంగా సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు.

కానీ ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు గానీ ఇదే నవల ఆధారంగా మరో చిత్రం కూడా రూపొందుతోంది. దీంతో పాపం క్రిష్‌కు ఇబ్బందులు ఎదురైనాయి. ఈ చిత్రం సబ్జెక్ట్‌ వర్క్‌ను సడన్‌గా పక్కనపెట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకీ ఈ సబ్జెక్ట్‌ను పక్కనపెట్టేయాలని క్రిష్‌కు చెప్పడమే కాదు.. మరో కథతో రమ్మని ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఇది కేవలం క్రిష్‌ అనుభవరాహిత్యం వల్లనే జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఆయన ముందుగా 'అతడు అడవిని జయించాడు' అనే నవల ఆధారంగా చిత్రం చేస్తున్నానని బయటపెట్టకుండా సీక్రెట్ ని మెయిన్‌టెయిన్‌ చేయాల్సింది. కానీ ఈ విషయం అందరికీ లీక్‌ అయింది. పోనీ ఆ నవల రైట్స్‌ను ముందుగా కొనుగోలు చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు.. కానీ ఆ పనికూడా క్రిష్‌ చేయలేదంటున్నారు. దాంతో ఇప్పుడు అందరూ ఆయ్యో...పాపం క్రిష్‌ అంటున్నారు. మరి త్వరలో వెంకీ కోసం ఎలాంటి సబ్జెక్ట్‌ను రెడీ చేస్తాడో వేచిచూడాల్సివుంది...!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ