మన పండగలకు కూడా లేని గిరాకీ ఇప్పుడు ప్రేమికుల దినోత్సవానికి వచ్చింది. వాలంటైన్స్‌డేకు యువత ఇస్తున్న గుర్తింపును చూసిన మన సీనియర్‌స్టార్స్ నుంచి యంగ్‌స్టార్స్‌వరకు, పెద్ద చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకు తమ ఫస్ట్‌లుక్‌లు, టీజర్ల విడుదలతో ప్రేమికుల దినోత్సవంకు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం 'కాటమరాయుడు'లో ఆయన హీరోయిన్ శృతిహాసన్‌తో ఉన్న స్టిల్ అదరగొట్టేసింది. ఇక సీనియర్ స్టార్ వెంకటేష్ కూడా తన 'గురు' చిత్రం తాజా పోస్టర్‌ను విడుదల చేశాడు. మెగాస్టార్ చిరంజీవి అయితే తాను హోస్ట్ చేస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి సంబంధించిన ఉమెన్స్‌డే సందర్భంగా తన ఒకప్పటి స్నేహితులు, సీనియర్ హీరోయిన్లైన రాధిక, సుమలత, సుహాసినిలతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లు చేస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం '2.0' కి సంబంధించిన ఓ ఫొటోను కూడా యూనిట్ విడుదల చేసింది.
సాయిధరమ్‌తేజ్ కూడా తాను రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశాడు. రాజ్‌తరుణ్ తాను చేస్తున్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'లోని ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు. మణిరత్నం దర్శకత్వంలో కార్తి, ఆదితిరావు హైదిరి జంటగా, రహ్మాన్ సంగీతంలో రూపొందుతున్న మరో కాశ్మీర్, మంచుకొండల బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న 'చెలియా' చిత్రంలోని రెండో సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. కాగా గత కొంతకాలంగా రహ్మాన్ సౌత్‌లో తన హవా చూపించలేకపోతున్నాడు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలోని 'చకోరి' పాట మాత్రమే ఈమద్య కేవలం ఆయన అందించిన మంచి సాంగ్ అని చెప్పాలి.కానీ 'చెలియా'తో మణి-రెహ్మాన్‌లు మరోసారి మాయ చేయనున్నారని ఇప్పటివరకు రిలీజైన రెండు ఆడియో పాటలను వింటే అర్ధమైపోతోంది.
'వెళ్లిపోమాకే...' చిత్రం లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు విడుదల చేయనుండటం విశేషం. ఇక 'పెళ్లిచూపులు' హీరో విజయ్‌దేవరకొండ హీరోగా నటిస్తున్న 'అర్జున్‌రెడ్డి' టీజర్‌లో హీరోయిన్‌తో లిప్‌లాక్ సీన్ ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. పూరీ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా నటిస్తున్న 'రోగో' చిత్రం లుక్‌తో పాటు ఓ చిన్న చిత్రంగా రూపొందుతున్న 'గువ్వగోరింక' చిత్రం టీజర్ కూడా విడుదలైంది. మరోవైపు విభిన్న చిత్రాలను చేస్తోన్న హీరో నారారోహిత్ నటిస్తోన్న 'కథలో రాజకుమారి' ఫస్ట్‌లుక్‌లో నారారోహిత్ ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా అద్భుతంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ ప్రేమికుల దినోత్సవం సినీ ప్రియులకు బాగానే వినోదాన్ని పంచిపెట్టింది.