బుల్లితెర మీద హాట్ యాంకర్ గా ఒక ఊపు ఊపుతున్న అనసూయ భరద్వాజ్ వెండితెర మీద కూడా ఒక వెలుగు వెలగడానికి తెగ తాపత్రయ పడుతుంది. పెళ్ళై ఇద్దరి పిల్లలికి తల్లి అయినా ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మరి అనసూయ అదే అందంతో హీరోయిన్ అవ్వాలని ఆశపడుతోంది. కానీ ఆమెకి సినిమాల్లో మంచి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. అందుకే అనసూయ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన కెరీర్ ని మలుచుకుంటుంది. అందులో భాగంగానే 'విన్నర్' చిత్రంలో ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా సాయి ధరమ్ హీరో. ఇప్పటికే అనసూయ ఐటెం సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఐటెం సాంగ్ మేకింగ్ విడియోతోపాటు పాటని కూడా విడుదల చేసింది. ఇక ఈ మేకింగ్ వీడియోలో అనసూయ అందాల ప్రదర్శన మతిపోగెట్టేలా ఉందని అంటున్నారు. డాన్స్ స్టెప్స్ తోనే కాకుండా అందాల ఆరబోతకు అనసూయ అడ్డుచెప్పలేదని అంటున్నారు. అయితే అనసూయ మాత్రం ఆ సాంగ్ వల్ల తనకు మంచి పేరు వస్తుందని అందుకే ఒప్పుకున్నని చెబుతుంది. ఇక అనసూయ ఈ సాంగ్ లో ఆడినందుకు గాను 10 లక్షలకు పైనే వసూలు చేసిందని అంటున్నారు. అంత ఆఫర్ చెయ్యబట్టే ఆమె ఐటెం కి ఒప్పుకుందని అంటున్నారు. మరి డబ్బు తీసుకుంటే తీసుకుంది గాని 'విన్నర్' చిత్రానికి మాత్రం అనసూయ ఐటెం సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ అని అంటున్నారు.