Advertisementt

వీరి పై అందరికి డౌట్ మొదలైంది..!

Wed 15th Feb 2017 06:38 PM
hero mahesh babu,director vamsi paidipally,producer pvp,ghazi premiere show  వీరి పై అందరికి డౌట్ మొదలైంది..!
వీరి పై అందరికి డౌట్ మొదలైంది..!
Advertisement
Ads by CJ

సినిమా వాళ్ళలో అజాత శత్రువులు వుండరు అలాగని మిత్రులు వుండరు. ఎప్పుడు ఎలా వుంటారో ఎవరకి తెలియదు. సినిమాల్లో నటించడం ఎలాగో ఇక్కడ శత్రుత్వం, మిత్రుత్వం అలాంటివే. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈ మధ్యన టాలీవుడ్ లో డైరెక్టర్ వంశీ పైడిపల్లికి నిర్మాత పివిపి కి మధ్యన చాలానే గొడవలు జరిగాయి. వారిద్దరి మధ్యన అగ్గిపుల్ల వేస్తె భగ్గుమనే పరిస్థితుల్లో కోర్టు కేసులు దాక వెళ్లారు ఇద్దరూ. అసలు వీరి గొడవకి కారణం హీరో మహేష్ బాబు. అదేమిటి మహేష్ బాబు వీరిద్దరి మధ్యన గొడవ పెట్టాడా అని అనుకుంటున్నారేమో... అలా మహేష్ డైరెక్ట్ గా వాళ్ళకి గొడవ పెట్టకపోయినా అతనితో చేసే సినిమా గురించి వంశీకి, పివిపి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యాయి. 

పివిపి తన నిర్మాణంలో చెయ్యాల్సిన మహేష్ బాబు సినిమాని వంశి పైడిపల్లి వేరొక నిర్మాతతో చేస్తున్నాడంటూ నిర్మాతల మండలిలోనే కాక కోర్టులో కూడా కేసు వేశాడు. అలాగే వంశి పైడిపల్లి వలన 'ఊపిరి' చిత్రానికి చాలా లాస్ వచ్చిందని ఆరోపణలు చేసాడు. మరి ఇంత బద్ద శత్రువులుగా మారిన వీరిద్దరూ ఈరోజు ఒకరితో ఒకరు కలుపుగోలుగా ఉంటూ రానా తాజా చిత్రం 'ఘాజీ' ప్రీమియర్ షో లో కనిపించి షాక్ ఇచ్చారు. వీరిద్దరి మధ్యన అసలేం జరగలేదన్నట్లు వీరు ప్రవర్తించారు. అలాగే వీరిద్దరూ కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్యన గొడవలు సమసిపోయి మళ్లీ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారా? అని అందరికి డౌట్ అయితే క్రియేట్ అయ్యింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ