చిరంజీవి నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు?'లో సెలబ్రిటీగా నాగార్జున హాట్ సీటులో కూర్చుంటున్నారు. ఎంఈకె మొదలైన కేవలం నాలుగు రోజులకే సెలబ్రిటీని కూర్చోబెట్టడం విచిత్రం. చిరంజీవి నిర్వహణలో కొంత మైలేజ్ వచ్చాక అంటే సామాన్యులు హాట్ సీట్లో కూర్చుని గేమ్ ఆడాలి. ఆ తర్వాత క్రేజ్ పెంచడం కోసం సెలబ్రిటీలను పిలుస్తారు. నాగార్జున నిర్వహించినపుడు ఇదే జరిగింది. కానీ చిరంజీవి వచ్చే సరికి మాత్రం నిర్వాహకులు వ్యూహం మార్చేశారు . నాలుగవ రోజునే నాగార్జునను రంగంలోకి దింపారు. వీక్షకులను ఆకట్టుకోవడం కోసమే నాగార్జునను పిలుస్తున్నారు. ఈ విషయంలో మరికొంతకాలం ఆగాల్సింది. సామాన్యులకే అవకాశం ఉంటుందనే సంకేతం ఇస్తే బావుండేది. చిరంజీవి హోస్ట్ గా ఎంఈకే ఏ మేరకు సక్సెస్ అవుతుందనే సంశయం చాలా మందిలో ఉంది. చిరంజీవి మంచి మాటకారి కాదనే విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఇమేజ్ అపారమైనది. కొద్ది రోజుల్లోనే తనదైన బ్రాండ్ వేయగలరని అంతా భావిస్తున్నారు. చిరంజీవిది కష్టపడే మనస్తత్వం అందువల్ల ఎంఈకె కు రేటింగ్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు.