Advertisementt

నాని అక్కడ కూడా హ్యాట్రిక్‌ సాధించాడు..!

Sat 18th Feb 2017 12:34 PM
hero nani.nenu local movie,hytric in oversis,new director shiva shankar,nani shooting in usa  నాని అక్కడ కూడా హ్యాట్రిక్‌ సాధించాడు..!
నాని అక్కడ కూడా హ్యాట్రిక్‌ సాధించాడు..!
Advertisement
Ads by CJ

నేడు తెలుగు పరిశ్రమకు ఓవర్‌సీస్‌ మార్కెట్‌ ఓ కల్పవృక్షంలా మారింది. స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను పెంచుకోవాలని తెగ కష్టపడిపోతున్నారు. ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు నచ్చే వైవిధ్యభరితమైన, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉండే చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇలా స్టార్స్‌ చిత్రాలే కాదు... 'పెళ్లిచూపులు' వంటి చిన్న చిత్రాలు కూడా వైవిధ్యభరితంగా రూపొందుతున్నాయి. మన స్టార్స్‌లో మాస్‌ఇమేజ్‌ బాగా ఉన్న ఒకరిద్దరు స్టార్స్‌ ఎంతో కష్టపడి ఇటీవలే మిలియన్‌ మార్క్‌ను అందుకున్నారు. 

కానీ తన కెరీర్‌లో మొదటి నుండి వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తున్న నేచురల్‌స్టార్‌ నానికి ఇప్పటికే ఓవర్‌సీస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవలే తెలుగులో రేర్‌ఫీట్‌ అయిన డబుల్‌హ్యాట్రిక్‌ను ఆయన సొంతం చేసుకున్నాడనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఓవర్‌సీస్‌లో ఇప్పటికే ఆయన నటించిన 'ఈగ', 'భలే భలే మగాడివోయ్‌' చిత్రాలు మిలియన్‌ డాలర్లను కొల్లగొట్టాయి. తాజాగా నాని నటించిన 'నేను లోకల్‌' కూడా ఓవర్‌సీస్‌లో ప్రీమియర్‌షోలతో సహా ఓపెనింగ్స్‌ కూడా బాగా రాబట్టుకుంది. 

తాజాగా ఈ చిత్రం కూడా మిలియన్‌ మార్క్‌ను చేరుకుందిట. దీంతో నాని ఖాతాలో మిలియన్‌ మార్క్‌ సినిమాలుగా మూడు వచ్చి చేరాయి. తన రాబోయే చిత్రాల ద్వారా ఆయన తన మార్కెట్‌ రేంజ్‌ను, మరీ ముఖ్యంగా ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను కబ్జా చేసుకోవడానికి బాగానే ప్రణాళికలు రచిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన శివశంకర్‌ అనే నూతన దర్శకుని చిత్రంలో బిజీ బిజీగా యూఎస్‌లోనే ఉన్నాడు. ఈ చిత్రం అమెరికా షెడ్యూల్‌ త్వరలోనే పూర్తికానుంది. మొత్తానికి నానికి 'మచ్చ' ఎక్కడ ఉందో అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ